ఆంధ్రప్రదేశ్‌

‘తక్కువ ధరకు ఇసుకను అందుబాటులోకి తేవాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాయకాపురం), ఆగస్టు 13: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఎత్తేయడానికి మద్దతు ఇచ్చిన వైసీపీ, టీడీపీ తద్వారా మన రాష్ట్ర హోదా విషయానికి గండి కొట్టాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవాలని, అదే విధంగా అక్రమాలను అరికట్టి తక్కువ ధరకు ఇసుకను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఎదురుచూస్తున్న ప్రజానీకానికి బీజేపీ చేసిన ద్రోహంతో తీవ్ర విఘాతం కలిగిందని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చెబుతున్నాయని, కానీ, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఎత్తివేయడానికి ఇవే పార్టీలు కేంద్రానికి మద్దతిచ్చాయన్నారు. తద్వారా మన రాష్ట్ర ప్రత్యేక హోదా డిమాండ్‌కు అన్యాయం చేశాయన్నారు. వర్షాభావంతో కరవు ఒకవైపు, ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు మరోవైపు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయన్నారు. అయినప్పటికీ ఈ సంవత్సరం కృష్ణా, గోదావరి నదులకు వరదలు రావడం వల్ల అన్ని ప్రాజెక్టులు నింపుకునే అవకాశం వచ్చిందన్నారు. కరవుతో అల్లాడుతున్న ప్రాంతాలకు నీరందేటట్లు చూడాలని, గోదావరి వరదల వల్ల మునిగిపోయిన పంటలకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు నత్తనడకగా జరుగుతున్నాయని, వీటిని వేగవంతం చేసి తక్షణం బాధితులకు అన్ని విధాలా సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అముల్లోకి రానందున ఎక్కడికక్కడ నిర్మాణ పనులు ఆగిపోయాయని, లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేక వీధిన పడ్డారని, నిర్మాణ రంగం కుదేలైందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.