ఆంధ్రప్రదేశ్‌

22, 24 తేదీల్లో డీఎస్సీ అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 16: డీఎస్సీ 2018కి ప్రాథమికంగా ఎంపికైన లాంగ్వేజ్ పండిట్ (హిందీ, తెలుగు మినహా), సెకండరీ గ్రేడ్ టీచర్ (తెలుగు మినహా), క్రాఫ్ట్స్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, మ్యూజిక్ అభ్యర్థుల వివరాలను సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఈ నెల 19వ తేదీన ఉంచుతారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారు. అదేరోజు ఆయా అభ్యర్థుల మొబైళ్ళకు సంక్షిప్త సమాచారం పంపుతామన్నారు. అభ్యర్థులు 20, 21 తేదీల్లో తమ సర్ట్ఫికెట్లను వెబ్‌సైట్‌లో తప్పకుండా అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా 22, 24 తేదీల్లో అభ్యర్థులకు సర్ట్ఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. నిర్దేశించిన కేంద్రాల్లో సదరు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు.