ఆంధ్రప్రదేశ్‌

కన్యకాపరమేశ్వరి దేవికి గవర్నర్ రోశయ్య బంగారు చీర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 19: కోరుకున్న కోర్కేలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. విశాఖ వన్‌టౌన్‌లో వెలసిన శ్రీ కనకాపరమేశ్వరి దేవస్థానం సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బంగారుచీర, పగడాల హారాన్ని గవర్నర్ రోశయ్య చేతులుమీదుగా సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్రమైన రోజైన శుక్రవారం అమ్మవారికి భక్తుల విరాళాలతో కోటి యాభై లక్షల విలువ చేసే నాలుగు కిలోల బంగారంతో తయారు చేసిన చీర, బంగారు ఆభరణాలు తన చేతులుమీదుగా ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విశాఖలో అతి పురాతనమైన ఆలయాల్లో కన్యకాపరమేశ్వరి ఆలయం ఒకటిగా ఆయన పేర్కొన్నారు. అమ్మవారి కటాక్షాలతో ఏపనైనా నెరవేరుతుందన్నారు. సంఘం సభ్యుల ఆలోచనలు విస్తృతం గా ఉండి అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉన్నా తక్కువ స్థలం ఉండటంతో వారి ఆశలు నెరవేరడంలేదన్నారు. అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం రాష్ట్ర విభజన తరువాత అన్ని సౌకర్యాలు కలిగి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చేస్తున్న ప్రయ్నాలు ఫలించాలని భగవంతుని ఆయన ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ ఆస్థానాచార్యాలు ఆర్‌బీబీ కుమార్‌శర్మ 200 మంది మహిళలతో సామూహిక శ్రీ చక్ర సహిత కుంకుమ పూజలు నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు నల్లూరి నూకరాజు, యలమర్తి హరినాథ్, గ్రంధి దుర్గాప్రసాద్, కంకటాల మల్లిక్, పైడా కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

కన్యకాపరమేశ్వరి అమ్మవారికి బంగారు చీర, హారం అందజేస్తున్న గవర్నర్ రోశయ్య