ఆంధ్రప్రదేశ్‌

‘అరుణ్ జైట్లీ మరణం బీజేపీకి తీరని లోటు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఆగస్టు 24: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మరణం పార్టీకి తీరని లోటని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ అన్నారు. తిరుపతిలో ఒకరోజు పర్యటన కోసం వచ్చిన ఆయన కార్యక్రమం ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మరణవార్త దేశ ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఎంతో దుఃఖానికి గురి చేసిందన్నారు. పార్టీలోనే కాకుండా దేశంలోనే ఎంత మంచి పేరున్న గొప్ప నాయకుడు అరుణ్‌జైట్లీ అన్నారు. ఏ రాష్ట్రంలో ఎటువంటి రాజకీయపరమైన సవాళ్లు ఉన్నా కూడా అరుణ్‌జైట్లీ మార్గదర్శకాలు పాటించేవారన్నారు.