ఆంధ్రప్రదేశ్‌

ఆవిరవుతున్న ఖరీఫ్ ఆశలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 22: గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ ఆశలు ఆవిరవుతున్నాయి..గత పదేళ్ల కాలంలో ఖరీఫ్‌లో ఇటువంటి గడ్డు పరిస్థితి ఎదురుకాలేదు.. గత 26 రోజుల్లో ఒక్క వర్షం కురిసిన రోజు కూడా నమోదు కాలేదు. ప్రస్తుత పరిస్థితిలో ఒక్క దుక్కు వర్షం కురిస్తే చాలు పైర్లు గట్టెక్కినట్టేనని రైతులు ఎదురుచూస్తున్నారు. డెల్టాలో సాగునీటి సదుపాయం నిరంతరాయంగా ఉన్నప్పటికీ ఎండ తీవ్రత అధికంగా ఉండటంవల్ల నీటి ఆవిరి శరవేగంగా జరుగుతుండటంతో శివారు భూములు పొలాలు బీటలువారుతున్నాయి. పంట కాల్వల్లో పూడిక పెరిగిపోవడం, సాగునీటి సామర్ధ్యానికి మించిన బోదెలు, తూములు, పైపులు పెరిగిపోవడంతోనూ శివారు ప్రాంతాలకు నీరు అందని స్థితి నెలకొంది. దీంతో గోదావరి సెంట్రల్ డెల్టా, ఈస్ట్రన్, వెస్ట్రన్ డెల్టాలో వేల ఎకరాల్లో పొలాలు ఎండిపోతున్నాయి. గోదావరి చెంతన ఉండే తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో సైతం ఖరీఫ్ సాగుచేస్తున్న భూములు బీటలువారి, నీటికోసం నోళ్లు తెరుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలో మొత్తం 8.69 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగుచేస్తున్నారు. డెల్టాలో ఆయకట్టును కాల్వల ద్వారా 60 శాతం సాగునీరు అందించేలా, 40 శాతం వర్షాధార రీతిలో డిజైన్ చేశారు. మొత్తం మూడు డెల్టాలకు నిత్యం 14,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసే విధంగా రూపొందించారు. ఈ రీతిలోనే నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ శివారుకు అందకపోవడానికి ప్రధాన కారణం పూడిక పెరిగిపోవడమే. దీనికి తోడు పలు ప్రాంతాల్లో ఆక్వా సాగు నిమిత్తం నీటిని మళ్లిస్తుండటంతో శివారు భూములకు నీటి ఎద్దడి నెలకొంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వర్షం పడి ఇరవై రోజులవుతున్న తరుణంలో సరఫరాచేస్తున్న కొద్దిపాటి జలాలు ఆవిరవుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ భూములు బీటలువారుతున్నాయి. సకాలంలో డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తయి వుంటే ఈ పరిస్తితి ఉత్పన్నమయ్యేది కాదు. డెల్టాల్లో శివారు భూములకు సైతం నీరు అందే పరిస్థితి వుండేది.ఇక తూర్పు గోదావరి జిల్లాలో మిగిలిన ప్రాంతాలను పరిశీలిస్తే అన్ని ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ నీటి ఆవిరి అధికంగా వుండటం, పుష్కర ఎత్తిపోతల పథకంలో పూడిక పెరిగిపోవడంతో సాగునీరు సక్రమంగా అందని స్థితి నెలకొంది. నీటిని పొదుపుగా వినియోగించుకుని ఉత్తమ యాజమాన్య పద్ధతులు మరింతగా అలవడినపు డేఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా బయటపడగలమని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. పైర్లు ఎండిపోతోన్న తరుణంలో ఇటు వ్యవసాయ శాఖ, అటు ఇరిగేషన్ అధికారులు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ రైతులను అప్రమత్తం చేస్తున్నారు. డెల్టాలో ఎగువ ప్రాంతంలో నీటిని వినియోగించుకున్న తర్వాత బోదెలు కట్టేస్తే, శివారుకు నీరు అందే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. శివారు భూములకు నీరు అందని స్థితి ఉన్నప్పటికీ, ఇప్పటికీ గోదావరి నది నుంచి దాదాపు 98 వేల క్యూసెక్కుల జలాలు వృథాగా సముద్రం పాలవుతూనే వున్నాయి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద 13.9 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది.

చిత్రం..ఐ.పోలవరం మండలంలో నీరందక ఎండిపోయిన వరి చేను