ఆంధ్రప్రదేశ్‌

లారీని ఢీకొన్న కారు : ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, ఆగస్టు 22: చిత్తూరు జిల్లా చంద్రగిరికి సమీపంలోని మల్లవరం బస్టాప్ వద్ద నిలిచి ఉన్న లారీని వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా కారును ఢీకొనడంతో సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఘోరప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రగాయాలకు గురయ్యారు. ఇన్నోవా డ్రైవర్ తప్పిదంతో లారీని వేగంగా ఢీకొనడంతో వాహనం ఎడమవైపు పూర్తిగా చిద్రమైంది. దీంతో మృతదేహాలు వాహనంలో చిక్కుకుపోయాయి. శవాలను వెలికి తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మదనపల్లికి చెందినటువంటి కృష్ణమూర్తి, నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇన్నోవాకారులో కృష్ణా పుష్కరాలకు వెళ్లారు. పుణ్యస్నానాలు ఆచరించి అదేరోజు రాత్రి స్వగ్రామం బయలుదేరారు. మల్లవరం సమీపంలో వెళ్తుండగా మరమ్మతులకు గురై నిలిచి ఉన్న లారీని ఇన్నోవా డ్రైవర్ గుర్రప్ప వేగంగా ఢీకొన్నారు. ఇన్నోవా ముందు సీట్లో కూర్చున్న ఉన్న కృష్ణమూర్తి (62) వెనుకసీటులో ఉన్న ఆయన భార్య భారతి (47), తమ్ముడు నాగరాజ (58) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మృతుడు కృష్ణమూర్తి కొడుకులైన ఎం.బాలాజి, ఎం.దినేష్, నాగరాజు కొడుకు బాలాజిప్రసాద్, డ్రైవర్ గుర్రప్ప చికిత్స పొందుతున్నారని ఎస్ ఐ ఇమ్రాన్ తెలిపారు. డ్రైవర్ వాహనం నడుపుతూ నిద్రపోవడంతో ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.