ఆంధ్రప్రదేశ్‌

సముద్రంలో సీతమ్మవారి పంచలోహ విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడవలూరు, ఆగస్టు 22: నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని రామతీర్థం సమీపంలో సముద్రంలో జాలర్లకు సీతమ్మవారి పంచలోహ విగ్రహం దొరికినట్లు తెలియవచ్చింది. మత్స్యకారులు సముద్రంలో వేట చేస్తుండగా వారికి వలలో లభించినట్లు తెలిసింది. ఆ విగ్రహం సముద్ర తీరంలోకి కొట్టుకొని రావడంతో వరిణి, దండిగుంట గ్రామాలకు చెందినవారు ఆ విగ్రహాన్ని తమతో తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. కాగా ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగి గాజులదినె్న గ్రామంలో మత్స్యకారులనుంచి సోమవారం సాయంత్రం ఒకటిన్నర అడుగు పొడవున్న సీతమ్మవారి పంచలోహ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహాన్ని ఎవరైనా దొంగిలించి సముద్రంలో పారేసారా లేదా ఏ విధంగా వచ్చిందనే అంశంపై విచారిస్తున్నట్లు కోవూరు సిఐ మాధవరావు చెప్పారు.