ఆంధ్రప్రదేశ్‌

తిరంగా యాత్రలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 22: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలంలో సోమవారం నిర్వహించిన తిరంగాయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రధాని పిలుపుమేరకు నరసాపురం ఎంపి గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గమంతటా కొద్ది రోజులుగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మొగల్తూరు మండలంలో తిరంగా యాత్ర నిర్వహణకు ఏర్పాట్లుచేశారు. పిప్పళ్ళవారితోట గ్రామంలోని హైస్కూలు ఆవరణలో జెండా స్థూపానికి ఉన్న ఇనుప రాడ్డును తీసి దానికి జాతీయజెండాను ఏర్పాటుచేసి అదే పాఠశాల ఆరుబయట ఏర్పాటుచేసేందుకు పాఠశాలలో పనిచేసే పిఇటి కురెళ్ళ వెంకట పురుషోత్తం (32) ప్రయత్నించారు. ఆ సమయంలో ఇనుప రాడ్డు పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో దాన్ని పట్టుకునివున్న పురుషోత్తం విద్యుదాఘాతానికి గురయ్యారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. పిఇటి మృతిచెందారన్న వార్త పాఠశాలకు చేరడంతో నలుగురు విద్యార్థులు స్పృహ తప్పిపడిపోయారు. వారికి వైద్య సేవలందించి, ఇంటికి పంపించేశారు.