ఆంధ్రప్రదేశ్‌

పంటకుంటల తవ్వకంలో దూసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22:్ఫరం పాండ్స్ తవ్వకంలో దేశంలో మన రాష్టమ్రే ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ‘నీరు- ప్రగతి’పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట సంజీవని కింద ఇప్పటివరకు 58 వేల పంట కుంటల తవ్వకం పూర్తి అయ్యిందంటూ దీనిని లాజికల్‌గా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. నీరు- మీరు పంట సంజీవని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, సిమెంటు రోడ్లు నిర్మాణం. అన్నింటిలో మనమే ముందుండాలన్నారు. రాష్ట్రంలో 16.1 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికి కూడా 11.2 శాతం భూగర్భ జలాల మట్టం పెరిగాయంటూ అంటే దాదాపు 230 టిఎంసిలు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. నీరే జవం, జీవం అంటూ జల సంరక్షణకు అందుకే అంత ప్రాధాన్యం ఇస్తున్నాన్నారు. వంశధార- నాగావళి, గోదావరి- పెన్నాను అనుసంధానం చేస్తున్నామన్నారు. నదులు అనుసంధానం, డ్రైస్సెల్ మిటిగేషన్, భూగర్భజలాల పెంపు ద్వారా కరవును అదృశ్యం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొదట్లో ఎన్టీఆర్ జలసిరి వెనుకబడ్డ ప్రస్తుతం వేగం పుంజుకోవడం పట్ల హర్షం ప్రకటించారు. ఎన్టీఆర్ జలసిరి కింద వచ్చిన 1,15,000 దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అన్ని బోర్లు రియల్ టైమ్‌లో డ్రిల్లింగ్ చేయాలన్నారు. నీరు చెట్టు కార్యక్రమం కింద 19,98,000 క్యూ.మీ పూడిక తొలగించడాన్ని అభినందించి దీనిని ఇదే స్పూర్తితో కొనసాగించాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 45,500 ఎకరాలలో ఉద్యాన తోటల పంపకం లక్ష్యాన్ని చేరుకోవలాన్నారు. విజయనగరం పశ్చిమ గోదావరి జిల్లాలలో ‘వాడవాడలా చంద్రన్న బాట’ కార్యక్రమం బాగుందంటూ మిగిలిన జిల్లాలలో కూడా పుంజుకోవాలన్నారు. 2017 మార్చి నాటికి అనుకున్న లక్ష్యం 3 వేల కి.మీ సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తికావాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం మరింత వేగవంతం కావాలన్నారు. జరిగిన పనులకు ఇప్పటివరకు రూ.692 కోట్లు చెల్లించాల్సి వుండగా కేవలం రూ.184 కోట్లు మాత్రమే చెల్లించారని, ఇంకా రూ.508 కోట్లు చెల్లింపులు పెండింగ్ ఉండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి శనివారం మధ్యాహ్నం, ప్రతి నాలుగో శనివారం మొక్కలు నాటడం , స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నీరు-చెట్టు కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. నేషనల్ గ్రీస్ కోర్‌లో 12 లక్షల మంది విద్యార్థులు నమోదయ్యారని అధికారులు పేర్కొనగా, పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కోరారు. 2018 కల్లా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా బహిరంగ మలవిసర్జన లేని (ఓడిఎఫ్) రాష్ట్రం కావాలన్నారు. పుష్కరాల తరహాలోనే అన్ని శాఖల ప్రగతిపై ప్రజల్లో 95 శాతం సంతృప్తి సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పుష్కరాలలో తాను కేవలం ప్రోగ్రాం ఇచ్చానని, సిస్టమ్ క్రియేట్ చేశామని, ఆ తరువాత తన ప్రమేయం లేకుండా అన్నీ క్షేత్రస్థాయి సిబ్బంది చేసుకుపోయారని, అనుకున్న ఫలితాలను సాధించారని ప్రశంసించారు. పుష్కరాలలో కమాండ్ కంట్రోలు రూమ్‌ను సమర్థంగా వినియోగించుకున్నామని, భవిష్యత్తులో కూడా దీనిని అన్ని శాఖలు వినియోగించుకుని పనితీరు మెరుగుపరచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రేపటినుంచి పుష్కరాల కమాండ్ కంట్రోల్ రూంను స్టేట్ కంట్రోల్ రూమ్‌గా మార్చుతున్నామని, దీని ద్వారా అన్ని శాఖల మధ్య మరింత సమన్వం, పరస్పర సహకారం పెరగాలని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రియల్ టైం గవర్నెన్స్, రియల్‌టైమ్ ఇంప్లిమెంటేషన్, రియల్ టైం కమ్యూనికేషన్ జరగాలన్నారు. పుష్కరాలలో ప్రజా స్పందనను ఒక ఉదాహరణగా, ఒక నమూనాగా తీసుకోవాలని దాని ప్రకారం తమ శాఖల అభివృద్ధి పనుల్లో ప్రజా స్పందన రాబట్టడం ద్వారా పనితీరును మెరుగుపరచు కోవాలన్నారు.