ఆంధ్రప్రదేశ్‌

దేశ భక్తులను స్మరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ , ఆగస్టు 22: స్వాతంత్య్ర భారతవనిలో దేశం కోసం త్యాగం చేసినవారిని స్మరించుకోవాల్సిన బాధ్యత వుందని అందరిపైనా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలోని ది న్యూ వెన్యూలో సోమవారం సాయంత్రం జరిగిన ‘స్వాతంత్య్ర సప్తతః సాయం సంధ్య’ కవుల, కళాకారుల, రచియితలు, గాయకుల ఇష్టాగోష్టి కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి మోడి స్ఫూర్తితో తిరంగ యాత్ర జరుపుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరిలో దేశ భక్తిని రగిలించాలని పేర్కొన్నారు. మతం ప్రతి ఒక్కరి వ్యక్తిగతమని, మతం వేరైనా, అందరి మనోగతం ఒక్కటేనన్నారు. మనం భారతీయులమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. దేశం కోసం ఎందో త్యాగం చేశారని, కానీ కొంత మందినే గుర్తుంచుకుంటున్నామని, ఎంతో మంది కవులు, కళాకారులు, గాయకులు, రచియితలు స్వాతంత్య్ర పోరాటంలో స్పూర్తిని రగిలించారనివారిని విస్మరించామని అటువంటి వారిని పైకితీసుకొచ్చి స్మరించుకోవాలనే కేంద్రప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రధానమంత్రితోనో, ముఖ్యమంత్రితోనో, మంత్రులతోనో అభివృద్ధికాదని, అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన అల్లూరు సీతారామరాజు, టంగుటూరు ప్రకాశం పంతులు, కాశీనాధ్ నాగేశ్వరరావు, సూర్యదేవర రాజ్యలక్ష్మీ, గౌతు లచ్చన్న వంటి ఎందరో స్వాతంత్య్ర పోరాటంలో త్యాగం చేశారని అన్నారు. ఎ.పి. శాసనసభాపతి కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్య్ర స్పూర్తిని భావితరాలకు అందించాలన్నారు. కొమరం భీం, చాకలి అయిలమ్మ, జార్ఖండ్‌కు చెందిన మండా, కర్నాలకు చెందిన రాణి చెన్నమ్మ, తమిళనాడుకు చెందిన పాండియార్ వంటివారిని గౌరవించటం మని విధి అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, శాసనసభపతి కోడెల శివప్రసాద్ పలువురు స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించి నగదు పురస్కారాలు అందజేశారు.