ఆంధ్రప్రదేశ్‌

ముక్త్యాలలో భారీ ఎత్తిపోతల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 22: ముక్త్యాలలో భారీ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గం మొత్తానికి శాశ్వతంగా సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సోమవారం జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో పుష్కర ఘాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి దానికి సంబంధించిన వివరాలను అధికారులు ప్రజా ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. 2.30గంటలకు రావాల్సిన సిఎం రెండు గంటల ఆలస్యంగా హెలికాప్టర్ ద్వారా సమీపంలోని కెసిపి సిమెంట్స్ ప్రాంగణంలో దిగారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన ముక్త్యాల చేరుకున్నారు. ముక్త్యాల ఘాట్‌లో ప్రజలకు అభివాదం చేసుకుంటూ పరిశీలించిన ముఖ్యమంత్రి నది ఒడ్డున గల శివాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఘాట్‌లపై ఏర్పాటు చేసిన వేదిక నుండి భక్తులనుద్దేశించి ప్రసంగించారు. 11రోజుల కృష్ణా పుష్కరాల్లో కోటి 80లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారని, కులమతాలకతీతంగా స్నానాలు చేశారన్నారు. యువత స్మార్ట్ ఫోన్లు, టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ నిర్వహించిన పుష్కరాల ఘనతను ఫేస్‌బుక్‌లో పెట్టి ప్రపంచంలోని తెలుగు వారందరికీ తెలియజేయాలన్నారు. గోదావరి పుష్కరాలను ప్రభుత్వం సాంప్రదాయకంగా ఘనంగా నిర్వహించిందని, కృష్ణా పుష్కరాల్లో లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని, అలాగే గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు. పుష్కరాల 12రోజులు 12సంకల్పాలతో నిర్వహించడం జరిగిందని, ప్రజలు అందరూ అండగా నిలవాలని కోరారు. పుష్కరాల నిర్వహణలో అధికార యంత్రాంగం చాలా సమర్థవంతంగా పని చేసిందని, స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు అల్పాహారం, భోజనం కల్పించడంతో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు వలంటీర్లులుగా భక్తులకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ బాబుకు జ్ఞాపికను బహూకరించారు. కోటను సందర్శించి సుమారు 20 నిమిషాల పాటు కోటలో ఉండి కెసిపి జెఎండి ఇందిరాదత్ ద్వారా ముక్త్యాల, రాజవంశీయుల చరిత్రను అడిగి తెలుసుకున్నారు.

చిత్రం..ముక్త్యాల ఘాట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు