ఆంధ్రప్రదేశ్‌

పెనువిషాదం నింపిన బస్సు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ/ఏలూరు, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో సోమవారం జరిగిన బస్సు ప్రమాదం గోదావరి జిల్లాల్లో పెనువిషాదం నింపింది. హైదరాబాద్ నుండి కాకినాడ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురయ్యిందనే సమాచారం మీడియాద్వారా తెలుసుకున్న గోదావరి జిల్లావాసులు తమ తమ వారి కోసం ఆదుర్దాకు గురయ్యారు. ఈ ప్రమాదంలో రెండు జిల్లాలకు చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం చింతాకులపేటకు చెందిన వాసంశెట్టి దుర్గాశ్రావణి (28), కాకినాడ గాంధీనగర్‌లోని పూలవారి వీధికి చెందిన సత్యప్రశాంత్ (22), రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన పట్నాల రమేష్ (21), పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం వేల్పూరుకు చెందిన కొప్పాడ జ్ఞాన సుమంతసాయి (20), ఉంగుటూరుకు చెందిన తొత్తల వెంకట త్రినాథ దుర్గారావు (25), నిడమర్రు మండలం దేవర గోపవరం గ్రామానికి చెందిన వానపల్లి పెద్దిరాజు (32) మృతిచెందిన వారిలో ఉన్నారు. వాసంశెట్టి సూర్యకుమారి కుటుంబం హైదరాబాద్‌లో ఉంటున్నారు. స్వగ్రామమైన తాళ్లరేవు మండలం చింతాలకుంటలో రేషన్ కార్డు కోసం వేలిముద్రలు వేయడానికి సూర్యకుమారి, ఆమె కుమార్తె దుర్గాశ్రావణి బస్సులో బయల్దేరారు. ప్రమాదంలో కుమార్తె దుర్గాశ్రావణి మృతిచెందగా, తల్లి సూర్యకుమారి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే కాకినాడకు చెందిన సత్యప్రశాంత్ హైదరాబాద్ నుండి కాకినాడ వస్తుండగా, ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పసలపూడి గ్రామానికి చెందిన రమేష్ హైదరాబాద్‌లో బస్సు క్వీనర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో జరుగుతున్న స్మార్ట్‌పల్స్ సర్వేలో నమోదు కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్ నుండి బస్సులో వస్తూ ప్రమాదంలో మృతిచెందాడు. ఇక ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న జ్ఞానసుమంత సాయి ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌లోని తన మేనమామ వద్దకు వెళ్లి, తిరిగివస్తుండగా, ప్రమాదంలో మృతిచెందాడు. ఉంగుటూరుకు చెందిన త్రినాథ దుర్గారావు ఆటో డ్రైవర్. హైదరాబాద్ వెళ్లి, తిరిగివస్తూ ప్రమాదంలో మృతిచెందాడు. తాపీమేస్ర్తీగా పనిచేస్తున్న నిడమర్రు మండలం దేవరగోపవరానికి చెందిన పెద్దిరాజు హైదరాబాదులో ఒక వివాహానికి వెళ్లి, తిరిగివస్తూ బస్సు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఇరు జిల్లాలకు చెందిన పలువురు గాయపడినట్టు సమాచారం.

చిత్రాలు..గాయపడ్డవారిని పరామర్శిస్తున్న వైకాపా అధినేత జగన్
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు