ఆంధ్రప్రదేశ్‌

విశ్వసనీయతే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: సమాచారాన్ని అందించడంలో ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు విశ్వసనీయతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పట్టణాభివద్ధి, ప్రసార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ మీడియా సంస్ధలు ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో గురుతర బాధ్యతను కలిగి ఉన్నాయని అన్నారు. సోమవారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందిని ఉద్ధేశించి ప్రసంగిస్తూ ప్రజలకు సమాచార సాధికారతను కల్పించడంలో ప్రభుత్వ మీడియా సంస్థలు తగు కృషి చేయాలని సూచించారు. సమాజంలో ఉన్న అవినీతి, పేదరిక, అసమానతలపై పోరాటం చేయడంలో సమాచారానికి మించిన ఆయుధం లేదని అన్నారు. కొన్ని మీడియా సంస్ధలు ఊహాజనితాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. వార్తలను అభిప్రాయాలతో జోడించరాదని ఆయన కోరారు.