ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల్లో ఫుల్‌గా పాలు, కూరగాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఒక్క విజయవాడ నగరానికే దాదాపు మూడు కోట్ల మంది పుష్కర యాత్రికులు తరలి రాగలరనే ప్రచారం, దానికితోడు జాతీయ రహదారులు, ఇతర వాహనాల ట్రాఫిక్ మళ్లింపు, ఇతరత్రా ఆంక్షలు వీటి నేపథ్యంలో నగర వాసులు హడలెత్తిపోయారు. పుష్కరాల సందర్భంగా ప్రతి ఇంట సహజంగానే బంధుమిత్రుల తాకిడి ఉండనే ఉంటుది. దీంతో పుష్కరాలకు ముందుగానే ప్రతి ఒక్కరూ తమ సాధారణ అవసరాలకు కొన్ని రెట్లలో కూరగాయలు కొనుగోలు చేయటంతో రైతు బజార్లు వెలవెలపోయే పరిస్థితి నెలకొంది. సందట్లో సడేమియాలా కొందరు వ్యాపారులు సరుకులను బ్లాక్‌లోకి తరలించారు. దీనిపై సిఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించి కూరగాయల వాహనాలనే గాక భారీ వాహనాల రాకపోకలకు సైతం పచ్చజెండా ఊపారు. విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించారు. ఆగ్రా, మదనపల్లి, కర్నూలు, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాల నుంచి ఉల్లిపాయలు, బంగాళాదుంప, మిర్చి వంటి కూరగాయలను రప్పించారు. నగరంలోని 12 రైతు బజారులు 24 గంటలు పనిచేసేలా చూడటమేగాక మొబైల్ రైతు బజార్‌లను రంగంలోకి దించారు. సాధారణంగా రోజుకు వెయ్యి టన్నుల కూరగాయలు విక్రయిస్తుంటే ప్రస్తుతం రోజూ రెట్టింపు స్థాయి విక్రయాలు జరిగాయి. అన్నింటి మించి సాధారణంగా విజయవాడకు రోజూ మూడు లేదా నాలుగు టన్నుల పెరుగు విక్రయిస్తే ప్రస్తుతం 20 లక్షల టన్నుల పెరుగును విక్రయించింది. అలాగే రోజూ 2 లక్షల 60 వేల లీటర్ల పాలు విక్రయం జరుగుతోంది. ప్రస్తుతం 3 లక్షల లీటర్ల పాలు విక్రయాలు జరుగుతున్నాయి. రోజూ రెండు లక్షల లీటర్ల మజ్జిగ తయారీ జరుగుతోంది. ప్రభుత్వానికి 75 లక్షల లీటర్లు ప్రభుత్వానికి, లక్షా 25 వేల లీటర్లు ఇతర సంస్థలకు విక్రయించబడ్డాయి.