ఆంధ్రప్రదేశ్‌

1992 నాటి పుష్కర జ్ఞాపకాలు1992 నాటి పుష్కర జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: ప్రస్తుత కృష్ణా పుష్కరాల్లో సిఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ముందెన్నడూ లేని విధంగానే కాకుండా నభూతో నభవిష్యత్‌లా విశాలమైన స్నాన ఘట్టాలతో ఎంతో పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయి. గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాలను ఓ గుణపాఠంగా మలచుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 170 స్నాన ఘట్టాల పరిధుల్లో ఇతరత్రా శాశ్వత ప్రాతిపదికన వౌళిక సదుపాయాల కల్పన కోసం అన్ని శాఖలు కల్సి దాదాపు రెండువేల కోట్లు పైన ఖర్చు చేసాయి. 12వ రోజు ముగిసే సమయానికి స్నానమాచరించిన యాత్రికుల సంఖ్య ఒక కోటీ 75 లక్షలు కూడా దాటలేదు.. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 1992 సెప్టెంబర్ 11 నుంచి 22 తేదీ వరకు జరిగిన పుష్కరాల్లో నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.9కోట్లు మాత్రమే. అందులో కృష్ణాకు రూ.4.13 కోట్లు, గుంటూరుకు రూ.1.67 కోట్లు, నల్గొండకు కేవలం రూ.10.5 లక్షలు, కర్నూలుకు రూ.42 లక్షలు, మహబూబ్‌నగర్‌కు రూ.71 లక్షలు మాత్రమే. అదనంగా పోలీస్ శాఖకు రూ.1.5 కోట్లు, వైద్య ఆరోగ్యశాఖకు రూ.40 లక్షలు పుష్కరాల ప్రత్యేక అధికారికి రూ.15 లక్షలు, సమాచారశాఖకు రూ.10 లక్షలు కేటాయించారు.
చామర్తి ఉమామహేశ్వరరావు ప్రత్యేక అధికారిగా వ్యవహరించారు. కేవలం రెండువేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటైనా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఇక ఆర్‌టిసి విజయవాడలో కేవలం 425 ప్రత్యేక బస్సులను నడిపింది. రైల్వేశాఖ 102 రెగ్యులర్ రైళ్లతో పాటు మరో 10 ప్రత్యేక రైళ్లను నడిపారు. విజయవాడ నగరంలో కేవలం 60 లక్షల మంది మాత్రమే స్నానాలు చేసారు. ఇక నోటిఫైడ్ ఘాట్లులేనిచోట 12 మంది నదిలో మునిగి చనిపోగా చివరి రోజున హైదరాబాద్ నుంచి 42 మంది ప్రయాణికులతో విజయవాడకు బయలుదేరిన ఆర్‌టిసి బస్సు గుంటుపల్లి వద్ద అదుపు తప్పి పక్కన గల పంట కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరో నెల రోజుల్లో రిటైర్డ్ కానున్న ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు నీట మునిగి అక్కడికక్కడే మరణించాడు. మరో 28 మంది గాయపడ్డారు. ఇక నేడు కూడా పుష్కర స్నానాల కోసం ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. విటిపిఎస్ కోసం ప్రకాశం బ్యారేజి వద్ద 12 అడుగులు నీటి మట్టం కొనసాగించాల్సి వుంది. దిగువన ఒక కాలువ తవ్వి పై అధికారులపై ఒత్తిడి తెచ్చి సాగర జలాశయం నుంచి కొంతమేర అదనపు నీటిని తెప్పించాల్సి వచ్చింది. తీరా తొలిరోజు వరదనీరు వచ్చి కాలువతో పని లేకపోయినా నాలుగో రోజుకి వరద లేక కాలువ పూడిపోయింది.

చిత్రం..పుష్కర స్నానమాచరిస్తున్న నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి