ఆంధ్రప్రదేశ్‌

ఆకట్టుకున్న తెప్పోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 23: గత 12 రోజులుగా పుణ్యక్షేత్రమైన అమరావతిలో సాగుతున్న కృష్ణా పుష్కరాలు మంగళవారం రాత్రితో వైభవంగా ముగిసాయి. తొలుత గుంటూరు రోడ్డులో ఉన్న పుష్కర నగర్ నుండి ముగింపు ర్యాలీని కలెక్టర్ కాంతీలాల్ దండే నగర పాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ లాంఛన ప్రాయంగా ప్రారంభించి మేళతాళాలు డప్పు వాయిద్యాల నడుమ బాణా సంచాతో మహిళలు దీపాలతో స్వాగతాలతో గంటన్నరపాటు అమరావతి పురవీధులలో ముగింపు ర్యాలీ కన్నులపండువగా సాగింది. అమరేశ్వర ఆలయం వద్దకు రాగానే పవిత్ర కృష్ణానదీ ఒడ్డున ఏర్పాటుచేసి ప్రత్యేక వేదిక వద్ద నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వేదమంత్రోచ్ఛారణల నడుమ కృష్ణమ్మకు హారతులివ్వడంతో పాటు అమ్మవారికి చీరె, సారె, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం పవిత్ర కృష్ణానదికి పంచ హారతుల కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించారు. గుంటూ రు చోడవరంలోని లలితాపీఠం ఆధ్వర్యంలో అమరావతిలో గత 12 రోజులుగా లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. లలితా అమ్మవారికి విశేష పూజలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా లలితా అమ్మ వారిని హంసతూలికా తల్పంలో ఏర్పాటుచేసిన తెప్పపై ఉంచి పవిత్ర కృష్ణానదిలో జలవిహారం నిర్వహించారు.

పుష్కరునికి వీడ్కోలు
కృష్ణమ్మ ఒడిలో తరించిన భక్తకోటి
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఆగస్టు 23: పవిత్ర కృష్ణవేణమ్మ ఒడిలో పుష్కర స్నానాలు చేసిన భక్త జన కోటి పుష్కరునికి ఘనంగా వీడ్కోలు పలికింది. మంగళవారం కృష్ణానదిని పుష్కరుడు వీడిన ఘడియల అనంతరం సాయంత్రం వరకు ఘాట్‌ల వద్ద భక్తులు పుణ్య స్నానాలాచరించారు. గత 12 రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం యావత్తు కృష్ణానదీ తీరం వెంట భక్తుల సేవలో తరించారు. చివరి రోజున సైతం లక్షలాది మంది భక్తులు కృష్ణవేణమ్మ చెంత సేద తీరారు. కృష్ణా పుష్కరాలకు శ్రావణమాసం సందర్భంగా శుక్ర, మంగళ వారాల్లో పితృదేవతలకు పిండ ప్రదానాలు నిర్వహించక పోయినప్పటికీ మిగిలిన రోజుల్లో వీవీఐపిలతో సహా శాస్త్రోక్తంగా పవిత్ర స్నానాలు చేసి పితృదేవతల ఆశీస్సులు పొందారు. జిల్లా వ్యాప్తంగా గత 12 రోజులుగా వివిధ ప్రాంతాలకు చెందిన కోటి మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. పుష్కర సమయం దాటిపోయినప్పటికీ పెద్దఎత్తున భక్తులు ఘాట్ల వద్దే స్నానాలు కొనసాగించారు. మధ్యాహ్నం ముహూర్త ఘడియల సమయానికి 4లక్షల 96వేల 520 మంది స్నానాలు చేశారు. పుష్కరాల ప్రారంభం రోజునే వరలక్ష్మీవ్రతం కావడంతో భక్తుల నుంచి స్పందన కనిపించలేదు.