ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం కృష్ణవేణమ్మకు హారతి ఇస్తున్న అర్చకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), ఆగస్టు 23: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు కలిస్తే ఇటువంటి విజయాలు మరెన్నో చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా పుష్కరాల చివరి రోజు ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల్లో పోలీసులంటే లాఠీలు కాదు, సేవకులు అనే పేరు వచ్చేలా వారు పని చేశారని ప్రశంసించారు. ఇప్పడు వచ్చిన పాజిటివ్ బ్రాండ్ ఇమేజ్‌ని భవిష్యత్తులో సక్రమంగా వినియోగించుకుంటే పోలీస్‌శాఖలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం, ప్రజాచైతన్యం, సమష్టితత్వం కృష్ణా పుష్కరాలు సాధించిన విజయంగా ఆయన పేర్కొన్నారు. పుష్కరాలకు వచ్చే చివరి యాత్రికుడు గమ్యస్థానం చేరేవరకు అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశించారు. పుష్కర విధుల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రణాళిక ప్రకారం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మొత్తం అల్లుకుపోయారని ప్రశంసించారు. ఎవరూ చెప్పకుండానే పుష్కర ఘాట్ల వద్ద అందరూ పారిశుద్ధ్యానికి సహకరించారని చెప్పారు. నదుల అనుసంధానం, భూగర్భజలాల పెంపు, నీరు-ప్రగతి, జలసంరక్షణ, మొక్కల పెంపకంపై అందరిలోనూ చైతన్య వచ్చిందన్నారు. పుష్కరాలలో నేర్చుకున్న బెస్ట్‌ప్రాక్టీసెస్‌ను రేపటి నుంచి ఇతర ప్రభుత్వ శాఖలలో అమలు చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలమని సిఎం తెలిపారు.