ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి హామీ పథకం అమలులో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ పాలిట వరంగా మారింది. ఈ పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటోంది. వేలకోట్ల రూపాయిల నిధులతో రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టడంతోపాటు ఇటు పనుల్లేక అల్లాడుతున్న పేదలకు జీవనోపాధిగా మారింది. అంటే ఒకే పథకంతో విస్తృత ప్రయోజనాలను సాధించుకుంటోంది. అలాగే ఇతర రాష్ట్రాల మాదిరి కాకుండా కొన్ని పథకాలు ఉపాధి హామీలో జోడించడం ద్వారా నిధులను సంపూర్ణంగా వినియోగించుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంట సంజీవని, నీరు-చెట్టు, ఫామ్ పాండ్స్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, చంద్రన్న బాట వంటి పథకాలను ఉపాధి హామీతో అనుసంధానం చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది 4000 కోట్ల రూపాయిలకు పైగా నిధులు వచ్చాయి. ఈ నిధులను వంద శాతం సద్వినియోగం చేసుకోవడంతోపాటు ఈసారి మరింత పెద్దమొత్తంలో నిధులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ నిధులతో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళిక కూడా రూపొందించారు. దీనిలో భాగంగా వాడవాడలా చంద్రన్నబాట పేరుతో ఐదువేల కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇప్పటికే 1686 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. పంట సంజీవని పేరుతో ఆరు లక్షల ఐదు వేల నీటికుంటల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 61,131 సేద్యపు నీటి కుంటల నిర్మాణం పూర్తయింది. ఐదు లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటికే రెండు లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 8వేల అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణంతోపాటు 1504 గ్రామ పంచాయతీ భవనాలు, 250 మండల స్థాయి భవనాల నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు.
ఉపాధి హామీ పథకంలో ఉద్యానవన తోటల పెంపకానికి కూడాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనివల్ల కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు, ఉద్యాన తోటలు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తోంది.
28వేల మంది రైతులకు చెందిన 48వేల ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకం చేపట్టింది. ఇప్పటికే 8వేల ఎకరాల్లో చెట్లు నాటడం పూర్తయ్యాయి. రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటడాన్ని కూడా రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యతాంశంగా గుర్తించింది. దీనిలో భాగంగా 12286 కిలోమీటర్లు పొడవునా, రోడ్లకు ఇరువైపులా దాదాపు 50 లక్షల చెట్లు నాటేందుకు సంకల్పించింది. ఇప్పటికే 1345 కిలోమీటర్లు పొడవునా ఐదున్నర లక్షల చెట్లు నాటడం పూర్తయింది. ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. కూలీల కనీస వేతనాన్ని 194 రూపాయిలు చేసింది. ఏడాదికి కనీసం వంద రోజులు పనిదినాలు కల్పిస్తున్న ప్రభుత్వం కరవు ప్రాంతాల్లో కనీసం 150 పనిదినాలు ఉండేలా చర్యలు చేపట్టింది. సిఎంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుండే రాష్ట్రంలో పేదలకు ఉపాధి కల్పిస్తూ, వారికి భరోసా ఇస్తోంది. తొలి ఏడాది 2961 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం రెండో ఏడాది నాలుగు వేల కోట్లకు పైగా ఖర్చు చేసి, కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డు కూడా సొంతం చేసుకుంది.