ఆంధ్రప్రదేశ్‌

సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, ఆగస్టు 24: గుంటూరు జిల్లా తాడికొండ మండల పరిధిలోని అమరావతి-గుంటూరు ప్రధాన ప్రధాన రహదారిలో గల విద్యుత్ సబ్‌సేష్టన్‌లో బుధవారం రాత్రి 100 పవర్ ట్రాన్స్ ఫార్మర్ పైన ఉన్న ఇన్స్‌లేటర్ పగలడంతో (పిటిఅర్) పేలి మంటలు చేలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో అయా గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురైనారు. ప్రభుత్వానికి నాలుగు కోట్లు నష్టం జరిగిందని అధికారులు అంటున్నారు. గుంటూరు, మంగళగిరి నుండి నాలుగు ఫైర్ ఇంజన్లు వచ్చినప్పటికీ ఫలితం శూన్యం. సబ్‌సేష్టన్‌లో మంటలు చెలరేగడంతో వాహనచోదకులు, బస్సు ప్రయాణికులు అక్కడ ఆగడంతోట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
వైకాపాలోకి 27న మానుగుంట
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,ఆగస్టు 24:రాష్ట్ర మాజీ మంత్రి, కందుకూరు మాజీ శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి ఈనెల 27న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తీర్ధంపుచ్చుకోనున్నారు. ఆమేరకు మానుగుంట కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్యనాయకులతో సమావేశమై తన నిర్ణయాన్ని తెలియచేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ముఖ్యనేతలందరు మానుగుంటను అనుసరించేందుకు సిద్దమైనట్లు సమాచారం. దీంతో ఈనెల 27న ఆయనతోపాటు ఆయన అనుచరగణం మొత్తం హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈపాటికే జగన్‌తోను,నెల్లూరు పార్లమెంటుసభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డితోను మానుగుంట మంతనాలు సాగించారు.