ఆంధ్రప్రదేశ్‌

జోన్ కార్యాలయానికి స్థలం గుర్తింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 10: దక్షిణకోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు తగిన స్థలాల కోసం రైల్వే ఇంకా జల్లెడ పడుతూనే ఉంది. ఇప్పటికే మూడు ప్రదేశాలను గుర్తించింది. అయినా ఇవేమీ అనుకూలంగా లేవని భావించి చివరకు విశాఖ రైల్వే స్టేషన్‌కు సమీపంలో వైర్‌లెస్ రైల్వే కాలనీని గుర్తించింది. ఇక్కడైతే ఒకవైపు స్టేషన్ పక్కనే జోన్ ప్రధాన కార్యాలయం ఉంటుందని, మరోపక్క వాస్తుపరంగాను అనుకూలించినట్టు తెలుస్తోంది. అన్నింటికంటే ప్రధానంగా వాల్తేర్ డివిజన్ లేకపోవడంతో దొండపర్తి డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాన్ని కూడా జోన్ కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చనే మరో ఆలోచన తెరమీదకు వచ్చింది. జోన్ ఉన్నతాధికారులు రైల్వే బోర్డుకు వెళ్ళేందుకు, అలాగే అక్కడి నుంచి తరచూ ఇక్కడకు వచ్చే వారందరికీ విశాఖ విమానాశ్రయం కూడా దగ్గరవుతుంది. దీంతో ఏ విధంగా చూసినా స్టేషన్‌కు అతి సమీపంలో ఉండే బ్రిటిష్ కాలం నాటి వైర్‌లెస్ కాలనీ ఉన్న మూడు ఎకరాల స్థలంపైనే రైల్వే ఉన్నతాధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఇందులో రైల్వే క్వార్టర్లు అన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వీటన్నింటిని తొలగించాల్సి ఉంది. ఇదొక్కటే సమస్యగా మారనుంది. ఎలాగూ శిథిలావస్థకు చేరుకోవడంతో వీటిని తొలగించి కొత్తగా క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలనే ఆలోచన గత కొంతకాలంగా ఉండనే ఉంది. అయితే ఇపుడు దక్షిణకోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయానికి ఎలాగూ తగినంత స్థలం కావాల్సి రావడంతో అన్నివిధాలా అనుకూలించే నిర్మాణాలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రైల్వేబోర్డు దృష్టిలోపెట్టి పాడు పడిన క్వార్టర్లను పూర్తి స్థాయిలో తొలగించి ఆ తరువాత జోన్ కార్యాలయ నిర్మాణం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. కాగా ఇప్పటికే విశాఖ నగర సమీపానున్న రుషికొండ, కొమ్మాది, సింహాచలం నార్త్ కేబిన్ తదితర ప్రాంతాల్లో ఉన్న రైల్వే స్థలాలను పరిశీలించింది. అయితే ప్రతిచోట ఏదో ఒక సమస్య తలెత్తుతున్నందునే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణంలో కాస్తంత జాప్యం జరుగుతుందనే అభిప్రాయం అధికార వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ప్రకటించి పది మాసాలు కావస్తున్నా ఇప్పటికీ దీనికి సంబంధించిన కార్యాలయమే ఏర్పాటు చేయకపోవడంపట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వాల్తేర్ డివిజన్ లేకుండా చేసిన రైల్వే చివరకు జోన్ కార్యకలాపాలు ఏమాత్రం దృష్టిసారించకపోవడంపట్ల వివక్షత స్పష్టమవుతోందని ఇక్కడి రైల్వేవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. విశాఖ రైల్వేస్టేషన్ సమీపాన జ్ఞానాపురం వైపు పేరుకే ఉన్న జోన్ తాత్కాలిక కార్యాలయంలో సైతం సవాలక్ష సమస్యలుంటున్నాయని ఈ వర్గాలు చెబుతున్నాయి.