ఆంధ్రప్రదేశ్‌

మహిళలపై దాడులను ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 12: మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడానికి తక్షణం స్పందించే వ్యవస్థ వుండాలని, ఆ దిశగా ఏపీ మహిళా కమిషన్ చర్య లు తీసుకుంటోందని కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. మహిళా కేసుల్లో చట్టపరంగా జాప్యం తలెత్తడం, న్యాయపరమైన ఆలస్యం, శిక్ష పడ్డంలో అలసత్వంవల్ల కూడా కేసులు అధికమవుతున్నట్టుగా ఇప్పటికే గుర్తించామని, ఇటువంటి పరిస్థితులవల్ల నేరస్తులకు భయం లేకుండా పోయిందని భావిస్తున్నామన్నారు. అఘాయిత్యాల కేసు ల్లో, కొన్ని అరుదుగా జరిగే కేసుల్లోనైనా వెంటనే శిక్షలుపడే విధంగా వేగవంతంగా విచారణ జరిగేలా చూడటంపై కమిషన్ దృష్టి పెట్టిందన్నారు. ఇటువంటి కేసుల విషయంలో ప్రభుత్వానికి ప్రత్యేకంగా నివేదించనున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో గురువారం మీడియా సమావేశంలో పద్మ మాట్లాడారు. కొన్ని ప్రత్యేక కేసుల్లోనైనా సరే విచారణ త్వరగా పూర్తిచేసి, నిందితులకు వెంటనే శిక్షపడేలా చూడాలని కమిషన్ కోరుతోందని, ఇందుకు సంబంధించి ఇప్పటికే హోం మంత్రితో కూడా చర్చించామన్నారు. ఇందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు. మహిళా కమిషన్ తరపున ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలపై జరుగుతున్న సోషల్ మీడియా దాడిని తప్పించుకోవడానికి కౌనె్సలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి రాష్ట్రంలోనే మొదటిసారిగా తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో కౌనె్సలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేవిధంగా శ్రీకారం చుట్టామన్నారు. ప్రతీ విద్యా సంస్థల్లో మహిళల భద్రతకు సంబంధించి ఒక ప్రత్యేక విభాగం ఉండాలని, అబ్బాయిలు, అమ్మాయిలకు కౌన్సిలింగ్ సెంటర్లు ఉండాలన్నారు. అమ్మాయిల్లోని ఆత్మస్థైర్యాన్ని బయటకు తీసుకొచ్చి తమకు తాముగా ఎదుర్కొనే శక్తికలిగించడానికి ఈ కౌనె్సలింగ్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలవల్ల మహిళలపై జరుగుతున్న దాడులను ఆపగలమని, ఆత్మస్థైర్యంతో వారికి వారే రక్షణ కల్పించుకునే శక్తినిచ్చినవారమవుతా మన్నారు. ఈ దిశగా కమిషన్ ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. మహిళా కమిషన్ తరపున ప్రత్యేక హెల్ఫ్‌లైన్ ఏర్పాటు చేస్తున్నామని పద్మ తెలిపార. అన్ని జిల్లాల్లో విద్యా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి కౌనె్సలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయించి, కమిషన్ తరపున ఒక కౌనె్సలర్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. సమస్య ఎదురైనప్పుడు ఎలా ధైర్యంగా నిలబడాలనే దానిపై ఒక అవగాహన కల్పించే దిశగా కృషిచేస్తున్నామన్నారు. దీనితో పాటు మహిళల సమస్యలపై సుమోటోగా స్పందిస్తున్నామని, సీఎం జగన్మోహన్‌రెడ్డి మహిళా సంక్షేమానికి సంబంధించి, భద్రతకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటూ మహిళా కమిషన్ మహిళా సాధికారతకు అనే కొత్త కార్యక్రమాలు తీసుకువస్తామన్నారు. మహిళా వివక్ష తదితర అంశాలపై మహిళా కమిషన్ అతి త్వరలో ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనుందన్నారు. అంతకుముందు ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్ పాతికేళ్ళ వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో సామాజిక మాధ్యమాలు-మహిళల భద్రత అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠికి ముఖ్య అతిథిగా హాజరై వాసిరెడ్డి పద్మ ప్రసంగించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కుడిపూడి పార్ధసారధి అధ్యక్షత వహించగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మండేలా శ్రీరామ్మూర్తి ఆధ్వర్యం వహించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు ప్రసంగించారు.