ఆంధ్రప్రదేశ్‌

భారతీయ జీవన విలువలు పెంపొందించేందుకే పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 25: భారతదేశ గ్రామీణ జీవన సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచంలోనే అత్యద్భుతమైనవని, అయితే నేడు విదేశీ ప్రభావానికి లోనై భారతీయ జీవన మూలాలకు దూరమవుతోందని భారత పరిక్రమ పాదయాత్ర చేస్తున్న ధార్మిక ప్రచార జాతీయ ప్రతినిధి పూజ్య సీతారాంజీ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామవికాస సాధన కోసం భారతీయ జీవన విలువలు పెంపొందించేందుకు 2012 ఆగస్టు 9న కన్యాకుమారిలో యావత్ భారత పరిక్రమ పాదయాత్ర ప్రారంభించినట్లు సీతారాంజీ తెలిపారు. గురువారం పెదకాకాని మండలం వెనిగండ్లకు వేంచేసిన సీతారాంజీ గ్రామంలోని మహిళలు, యువతతో సమావేశమై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఏ విధంగా పరిరక్షించాలనే అంశాలను వివరించారు. వివిధ కుల వృత్తుల వారిని కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విహెచ్‌పి ప్రతినిధి గృహంలో స్థానికులతో సమావేశమై మాట్లాడారు. గతంలో దేవాలయాలకు వెళ్లడం వల్ల పిల్లలకు భగవంతుని పేర్లు పెట్టేవారని, ప్రస్తుతం టివి సీరియళ్లలోని పాత్రధారుల పేర్లు పెడుతున్నారని, ఈ సంస్కృతికి స్వస్తి పలకాలని సూచించారు. కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటే గ్రామం సుభిక్షంగా ఉంటుందని, దేశానికి గ్రామాలే మార్గనిర్దేశం చేస్తాయన్న నిజాన్ని అందరూ గ్రహించాలన్నారు. ప్రపంచంలో భారతదేశం ఒక్కటే విశ్వ కళ్యాణాన్ని కాంక్షిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు తాను సుమారు 25 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి తిరిగి కన్యాకుమారి చేరుకుని పరిక్రమ యాత్ర పూర్తిచేస్తానని సీతారాంజీ పేర్కొన్నారు. స్వామీజీ వెంట ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కార్యనిర్వాహక్ వడ్లమూడి అవతేశ్వరరావు, పాదయాత్ర ఎపి ఇన్‌చార్జి కృష్ణమోహన్, ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర ప్రతినిధి సుబ్బరామిరెడ్డి, చలువాది వెంకటేశ్వర్లు, మాకిరెడ్డి వెంకటప్పారెడ్డి తదితరులున్నారు.

చిత్రం.. సందేశమిస్తున్న ధార్మిక ప్రచార జాతీయ ప్రతినిధి పూజ్య సీతారాంజీ