ఆంధ్రప్రదేశ్‌

‘వన్‌ర్యాంక్ వన్ పింఛన్’పై విజ్ఞాపనల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 25: మాజీ సైనికోద్యోగులకు ‘వన్ ర్యాంక్ -వన్ పింఛన్’ విధానం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి శుక్రవారం విశాఖపట్నం వస్తున్నారు. విశాఖ నేవల్ బేస్ సమీపంలోని ఐఎన్‌ఎస్ సముద్ర ఆడిటోరియంలో జస్టిస్ నరసింహారెడ్డి మాజీ సైనికుల నుండి వినతిపత్రాలు స్వీకరిస్తారు. భారత సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసిన సుమారు 16 లక్షల మంది మాజీ సైనికులున్నారు. వీరికి పింఛన్ల మంజూరులో అసమానతలున్నాయి.
ఒకే పదవిలో రిటైరైన వారందరికీ ఒకే విధంగా పింఛన్ మంజూరుచేయాలని ‘వన్ ర్యాంక్ - వన్ పింఛన్’ నినాదంతో ఎంతో కాలంగా మాజీ సైనికులు ఆందోళన సాగిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినప్పటికీ అమలుచేయడంలో తాత్సారం వహించింది. దీంతో మాజీ సైనికులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 325 రోజుల పాటు నిరాహార దీక్షలు నిర్వహించడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వన్ ర్యాంక్ వన్ పింఛన్ (ఒఆర్‌ఒపి) అమలుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం, పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. ఆయన వన్ ర్యాంక్ - వన్ పింఛన్ విధానంపై మాజీ సైనికుల నుండి విజ్ఞాపనలు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం విశాఖపట్నంలో విజ్ఞాపనలు స్వీకరిస్తారని రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం కన్వీనర్ టిఎస్ విశ్వనాథ్ తెలిపారు. మాజీ సైనికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కూడా కమిటీ ఫిర్యాదులు స్వీకరిస్తుందన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నివసించే మాజీ సైనికులు ఏ విధమైన సమస్యలున్నా కమిటీ ముందుంచాలని సూచించారు. ఇతర సందేహాలకు 76759 24666 మొబైల్ నంబరుకు ఫోన్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.