ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రాలో జల రవాణాకు మంచిరోజులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: ఆంధ్ర రాష్ట్రంలో జల రవాణాకు మంచి రోజులు వచ్చేశాయి. కాకినాడ-పుదుచ్చేరి మధ్య రూ.3200 కోట్ల విలువైన జలరవాణా మార్గాన్ని నిర్మించడంలో భాగంగా తొలి దశలో 68 కి.మీ పొడవున కాల్వను తవ్వేందుకు రూ. 69.76 కోట్లతో టెండర్ ప్రక్రియను వచ్చే వారం ఖరారు చేయనున్నారు. ముక్త్యాల-చామరు మధ్య 30 కి.మీ, చామరు-హరిచంద్రపురం మధ్య 38 కి.మీ జల రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు టెండర్లను పిలవనున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. జలరవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ. 500 కోట్లను విడుదల చేసింది. ముక్త్యాల-విజయవాడ-కాకినాడ జల రవాణాను తొలి దశలో నిర్మిస్తామని ఆయన చెప్పారు. కృష్ణా-గోదావరి జలాల అనుసంధానానికి జల రవాణా ఉపయోగపడుతుందన్నారు. పూడిక తీయడం, ఆధునీకరణ, భూమి సేకరణ, టర్మినల్స్ నిర్మాణానికి రూ. 3200 కోట్లతో అంచనా వేసినట్లు చెప్పారు. కేంద్ర జల రవాణా అథారిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందం ఖరారు చేసిందన్నారు. ఇందులో 51 శాతం వాటా జలరవాణా అథారిటీ, ఆంధ్రా వాటా 49 శాతం ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో రవాణా, పర్యావరణ కాలుష్య నివారణ, పర్యాటక రంగం అభివృద్ధికి జల రవాణా ఉపయోగపడుతుందని చెప్పరు.
తొలి దశలో భాగంగా చేపట్టనున్న ముక్త్యాల-చామరు, చామరు-హరిచంద్రపురం జల రవాణా మార్గాన్ని ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. విజయవాడ నుంచి ముక్త్యాల (జగ్గయ్యపేట) వరకు పూడిక పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ను తరలించేందుకు జల రవాణా తోడ్పడుతుందన్నారు. జల రవాణా వ్యవస్ధపై డిపిఆర్‌ను రూపొందించి అథారిటీకి సమర్పించామన్నారు. ఈ రవాణా మార్గం సిద్ధమైతే సాలీనా 11 మిలియన్ టన్నుల బొగ్గు, బియ్యం, ఆహార ధాన్యాలు, సిమెంట్, ఎరువులు, అటవీ ఉత్పత్తులు, ఉప్పు, ఇతర సరకులను రవాణా చేస్తామన్నారు.
మొత్తం రూ. 3200 కోట్ల ప్రాజెక్టు వివరాలను అజయ్ జైన్ వెల్లడించారు. ఇందులో 33.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుక, మట్టి పూడిక తీసేందుకు రూ. 800 కోట్లు ఖర్చవుతుంది. దాదాపు 5354 ఎకరాల భూమిని సేకరిస్తారు. ఇందులోప్రభుత్వ భూమి 4596 ఎకరాలు, ప్రైవేట్ భూమి 956 ఎకరాలు అవసరమని గుర్తించారు. భూమి సేకరణకు రూ. 800 కోట్లు ఖర్చవుతుంది. 11 టర్మినల్స్ నిర్మాణానికి రూ. 250 కోట్లు వ్యయమవుతుంది. 409 చోట్ల కల్వర్టులు, వంతెనల నిర్మాణానికి రూ. 1650కోట్లు ఖర్చవుతుందని అజయ్ జైన్ తెలిపారు.