ఆంధ్రప్రదేశ్‌

నృసింహాలయంలో వరుణయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఆగస్టు 26: రాష్ట్రంలో వర్షాలు కురవాలని , పంటలు బాగా పండాలని ప్రార్థిస్తూ శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడురోజుల వరుణయాగం ప్రారంభమైంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు కార్యక్రమంలో పాల్గొని కలశాలతో ఆలయంలో ప్రదక్షిణలు చేసి వరుణయాగాన్ని ప్రారంభించారు. ఆలయ ఉపప్రధాన అర్చకుడు దీవి అనంత పద్మనాభాచార్యులు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ యాగం ఆదివారం వరకు జరుగుతుందని ఇఓ మండెపూడి పానకాలరావు తెలిపారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షాలు కురవాలని, పంటలు పండాలని ప్రార్థిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాల్లో వరుణయాగాలు జరుపుతున్నట్లు చెప్పారు. రైతు సంక్షేమానికి తెలుగుదేశ ప్రభుత్వం కృషి చేస్తోంద చెప్పారు.

వరుణయాగంలో పాల్గొన్న మంత్రులు చినరాజప్ప, పుల్లారావు, కిషోర్‌బాబు