ఆంధ్రప్రదేశ్‌

ఛానళ్ల నిలిపివేత దారుణం: దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: ఏడు జాతీయ పత్రికల సంపాదకీయాల్లో 100 రోజుల జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపారని టీడీపీ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి కూడా చర్చించారన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, తెలివి తక్కువ నిర్ణయాల కారణంగా కుంటుపడేలా చేశారంటూ విజయవాడ టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పీపీఏల రద్దుతో రాష్ట్ర ప్రయోజనాలతోపాటు జాతీయ ప్రయోజనాలను సైతం దెబ్బతీశారని, రాష్ట్రం తిరోగమనంలో ఉందని జాతీయ పత్రికలు చెప్పాయన్నారు. రాష్ట్రానికి చెందిన విషయాలను పత్రికల్లో విశే్లషిస్తే సీఎం నోరు విప్పడం లేదని, ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏబీఎన్, టీవీ 5 ఛానళ్లను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ఆపిందని, ఇదేమైనా రాజరిక పరిపాలనా అని ప్రశ్నించారు. ఈ ఛానళ్లు మీ అవినీతిని, వైఫల్యాలను ప్రజలకు ఎత్తి చూపుతున్నారని ఎంఎస్‌వోలపై ఒత్తిడి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని 4 గంటలపైగా పోలీసు స్టేషన్‌లో అక్రమంగా ఉంచారని, అచ్చెన్నాయుడు మీద ఎస్‌ఐతో ఫిర్యాదు చేయించి తప్పుడు కేసులు నమోదు చేశారని, నన్నపనేని రాజకుమారిపై అక్రమ కేసు నమోదు చేశారని, చింతమనేని ప్రభాకర్ సరెండర్ అయితే పోలీసులు పట్టుకున్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు.