ఆంధ్రప్రదేశ్‌

స్వార్థ ప్రయోజనాల కోసమే యురేనియం తవ్వకాలు: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 14: ప్రజలు, పర్యావరణం తరువాతనే అభివృద్ధి అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కొందరు స్వార్థ శక్తుల ప్రయోజనాల కోసమే యురేనియం తవ్వకాలని శనివారం ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమానికి లోకేష్ సంపూర్ణ మద్దతు తెలిపారు. అభివృద్ధి అనేది అవసరమేననీ, అయితే ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని పణంగా పెట్టి మాత్రం కాదన్నారు. ఇలాంటి ప్రాజెక్టులు కొన్ని స్వార్థ శక్తుల ప్రయోజనాలను తీర్చుతాయని, కానీ జాతి ప్రయోజనాలను దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధనం విషయంలో ప్రపంచానికే నాయకత్వం వహించే స్థితికి భారత్ చేరుకుంటున్న వేళ యురేనియం ఖనిజం ఎందుకని ప్రశ్నించారు. నల్లమల అడవులను రక్షించాలని లోకేష్ పిలుపునిచ్చారు.