ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో మళ్లీ ముద్రగడ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 27: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్లీ ఆందోళనకు సన్నద్ధమవుతున్నట్టు ప్రకటించడంతో అధికార తెలుగుదేశం పార్టీలో కలకలం చెలరేగుతోంది. ముద్రగడ ఆందోళనకు దిగే ప్రతిసారీ అంతుచిక్కని వ్యూహాలను అనుసరిస్తుండటం తెలిసిందే! కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని గమనిస్తూనే, రాష్ట్రంలోని తన సామాజికవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన ముద్రగడ తాజాగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. దీంతో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలయ్యింది. ముద్రగడ ప్రకటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఇటీవల ముద్రగడ రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో నిరాహార దీక్షలో ఉండగా ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగార్చినట్టుగా ప్రజల్లోకి సంకేతాలు పంపడంలో విజయవంతమయ్యింది. ముద్రగడ డిమాండ్లపై లిఖితపూర్వకమైన హామీని ఇవ్వకుండా, మంత్రులు గాని కనీసం ప్రభుత్వ ప్రతినిధి బృందం గాని ఆసుపత్రి ఛాయలకు రాకుండా ఆ ఎపిసోడ్‌కు తెర దించేశారంటూ ఆయా వర్గాలు చర్చించుకున్నాయి. కాగా తమ ఉద్యమ కార్యాచరణను సెప్టెంబరు 11న రాజమహేంద్రవరంలో ప్రకటించనున్నట్టు కాపు జెఎసి ప్రకటించింది. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అక్రపమత్తమయ్యింది. ముద్రగడ ఉద్యమ వ్యూహ రచనపై అప్రమత్తంగా ఉండాలని, ఉద్రిక్త పరిస్థితుల వైపు కాపు సామాజికవర్గం వెళ్లకుండా కట్టడి చేసే బాధ్యత మీదేనంటూ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సహా కాపు ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ముఖ్యమంత్రి నుండి ఆదేశాలు జారీ అయినట్టు భోగట్టా! ముద్రగడ ఆమరణ దీక్ష సమయంలో దిగివచ్చిన ప్రభుత్వం ఏడు నెలల్లోగా సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిందని కాపు నేతలు పేర్కొంటున్నారు. కాపులను బిసిల్లో చేర్చుతామంటూ ఇచ్చిన ఏడు నెలల గడువు ఈ ఆగస్టుతో పూర్తయ్యిందని, మంజునాథ కమిషన్ ఇంతవరకు రాష్ట్రంలో పర్యటించకపోవడం చూస్తే, బీసీల్లో తమను చేరుస్తారనే నమ్మకం లేదని జెఎసి వ్యాఖ్యానిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజికవర్గం తీవ్ర ఆవేదనతో ఉన్నారని పేర్కొంటున్నారు. 13 జిల్లాల్లో కాపు జెఎసి కార్యవర్గాలను ఏర్పాటుచేశామని, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కూడా కమిటీలను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఈ సారి ఉద్యమం అంటూ జరిగితే తీవ్రంగానే ఉంటుందని ఉంటుందని జెఎసి హెచ్చరించడం గమనార్హం!