ఆంధ్రప్రదేశ్‌

నేలపాడు రైతులకు ప్లాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, ఆగస్టు 27: తుళ్లూరు మండలం, నేలపాడు గ్రామానికి చెందిన 54 మంది అసైన్డ్ భూముల రైతులకు ప్లాట్ల కేటాయింపు శనివారం జరిగింది. తుళ్లూరు సిఆర్‌డిఎ ప్రాంతీయ కార్యాలయ ఆవరణలో జెసి ముంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డ్రా పద్ధతిన ప్లాట్లను కేటాయించారు. 2వ విడత డ్రాలో భాగంగా 54 మంది రైతులకు నివేశన, వాణిజ్య స్థలాలను కేటాయించగా పలువురు రైతులు సందేహాలను వ్యక్తంచేశారు. రెండు నెలలుగా మొదటి విడత ప్లాట్ల పంపిణీలో తప్పులను సవరించాలని కోరినా సిఆర్‌డిఎ అధికారులు స్పందించడం లేదని నాగేశ్వరరావు అనే రైతు వాపోయారు. దీనిపై ముంగా వెంకటేశ్వర్లు స్పందిస్తూ ఇవి కేవలం తాత్కాలిక ధ్రువీకరణ పత్రాలేనని, శాశ్వత ధ్రువీకరణ పత్రాల కేటాయింపు సమయంలో పూర్తి సవరణలు చేపడతామని, అనంతరం అగ్రిమెంట్‌కు వస్తామని వివరించారు.
మంత్రి నారాయణ ఫైర్

చిత్రం.. రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న జెసి వెంకటేశ్వర్లు