ఆంధ్రప్రదేశ్‌

వేధింపులే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 16: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులతోనే నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి అత్యంత విషాదకరమని, ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని ఏనాడూ అనుకోలేదని భావోవ్వేగానికి గురయ్యారు. సోమవారం మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఉదంతం టీడీపీ
శ్రేణులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్‌టీఆర్ భవన్‌లో కోడెల చిత్రపటానికి చంద్రబాబుతో సహా పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రముఖ వైద్యుడిగా ఉన్న వ్యక్తి, తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగిన కోడెల ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఊహించని పరిణామమన్నారు. ఎంతటి క్షోభకు గురైతే ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడి ఉంటారో నంటూ కన్నీరు పెట్టుకున్నారు. కోడెలకు భయమంటే ఏమిటో తెలియదని, అయితే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఎటువంటి అవమానాలకు గురిచేస్తుందోనన్న మానసిక సంఘర్షణతో బలవన్మరణం పాలయ్యారని విచారం వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి వేధింపులతో తనకు నిద్ర పట్టడం లేదని తన వద్ద కోడెల పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ, కార్యకర్తలు, ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలని తాను కోడెలకు సూచించానని తెలిపారు. తనవరకు తాను వ్యక్తిగతంగా మంచి మిత్రుడు, రాజకీయ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశారు. వైద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ వైద్యశాలల్లో వసతుల కల్పనకు ఎంతగానో కృషిచేయగా భారీ నీటిపారుదల శాఖమంత్రిగా ప్రాజెక్టుల నిర్మాణానికి పాటుపడ్డారన్నారు. స్పీకర్‌గా ఉన్న సమయంలో మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహణ ద్వారా అంతర్జాతీయంగా ఏపీకి ఎంతగానో పేరు తెచ్చారని కొనియాడారు. గొప్ప వైద్యునిగానే కాకుండా ఆరుసార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా, స్పీకర్‌గా కోడెల సేవలు మరువలేనివని, సీనియర్ నేతను తెలుగుదేశం పార్టీ కోల్పోయిందని బాధను వ్యక్తంచేశారు. పేదల డాక్టర్‌గా కోడెల ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారని, కోటప్పకొండ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి కోడెల చేసిన కృషిని మరువలేమని తెలిపారు.
నేడు గుంటూరుకు కోడెల పార్థివదేహం
అనంతరం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో డాక్టర్ కోడెల సంతాప సభలు నిర్వహించాలని, పార్టీ కార్యాలయాలపై టీడీపీ జెండాలను అవనతం చేయాలని సూచించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుండి కోడెల పార్థివదేహాన్ని అమరావతికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సూర్యాపేట, కోదాడ, విజయవాడ, మంగళగిరి మీదుగా గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, కోడెల కుటుంబ సభ్యులు, బంధువుల సందర్శనార్థం ఏర్పాట్లు చేయాలని కోరారు. మంగళవారం సాయంత్రం నర్సరావుపేటలోని కోడెల స్వగృహానికి పార్థివదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించి మంగళవారం లేక బుధవారం అంత్యక్రియలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
*చిత్రం... కోడెల శివప్రసాదరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న చంద్రబాబు, ఇతర నేతలు