ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 27: వ్యవసాయ అనుమంధ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, చేపల పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రైతులు పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవించడం సాధ్యం కానందున అనుబంధ రంగాలను ప్రోత్సహించి వారిని ఆదుకోవాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచ ప్రఖ్యాత పశుసంపద జన్మస్థలం ఆంధ్రప్రదేశ్. ఒంగోలు, పుంగనూరు వంటి జాతి పశువులకు, గోదావరి జాతి దున్నలకు, నెల్లూరు జాతి గొర్రెలకు, అసీల్ జాతి కోళ్లకు పెట్టిది పేరు ఎపి. ఆ జాతుల ఉత్పత్తులు పెంచడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో పాడి పరిశ్రమ రంగం మొత్తం రాష్ట్ర ఉత్పత్తుల (జిఎస్‌డిపి)లో రూ.49 వేల కోట్లతో 8.85 శాతం వాటాను కలిగి ఉంది. ఈ రంగం క్రమంగా రెండంకెల వృద్ధి రేటుకు చేరుకుంటోంది. కోడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో ఉంది. దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి అయిదు గుడ్లలో ఒకటి ఎపిలోనే ఉత్పత్తి అవుతోంది. మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఎపి ఉంది. దేశంలో రూ.250 కోట్లతో పశు సంపదకు మేత రక్షణ విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఎపి. రైతులకు సబ్సిడీ ధరలకు ప్రభుత్వం మేతను సరఫరా చేస్తోంది. అలాగే పశుగ్రాస క్షేత్రాల పథకం ద్వారా పచ్చటి గడ్డి కిలో రూపాయికే రైతుల ఇళ్ల వద్దకు చేరుస్తున్నారు. పౌల్ట్రీ రైతులకు ఉపయోగపడే విధంగా పౌల్ట్రీ అభివృద్ధి విధానాలను అమలు చేస్తున్నారు. గొర్రెలు పెంచే రైతులను ప్రోత్సహించేందుకు, గొర్రెల మేతకు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక పథకాన్ని ప్రకటించనుంది. గొర్రెల పెంపకం దారులకు కూడా ఎన్‌సిడిసి (నేషనల్ కోపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా 4 శాతం వడ్డీ (పావలా వడ్డీ)కి రుణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేపల ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం జిఎస్‌డిపి ఈ రంగం నుంచే లభించింది. ఈ రంగాన్ని ప్రభుత్వం రెండంకెల ఆర్థిక వృద్ధి రేటుకు గ్రోత్ ఇంజన్ (వృద్ధికారకం)గా గుర్తించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతి అయ్యే చేపలు, రొయ్యలలో 42 శాతం ఎపి నుంచే అవుతాయని ఆశిస్తున్నారు. 27 లక్షల టన్నుల ఉత్పత్తి, రూ.40 వేల కోట్ల జివిఎతో 32.55 శాతం వృద్ధి రేటు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దేశంలో మన రాష్ట్రం ఆక్వా హబ్‌గా రూపొందించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ‘ఎపి ఫిషరీస్ పాలసీ-2015’ని తీసుకువచ్చింది. పాడి, పౌల్ట్రీ, డెయిరీ, చేపల పరిశ్రమలను ప్రోత్సహించే క్రమంలో ఆయా రంగాలలో నిపుణుల అవసరం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేటు రంగంలోనూ ఆయా కోర్సులకు సంబంధించిన కాలేజీలను, విశ్వవిద్యాలయాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. యానిమల్ హస్బెండరీ, డెయిరీ, ఫిషరీస్ రంగాలకు ఉపయోగపడే విధంగా నిపుణులు తయారవడానికి ఫిషరీస్, ఓషన్ విశ్వవిద్యాలయాలతో పాటు పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేస్తారు.