ఆంధ్రప్రదేశ్‌

నేడు లారీల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: లారీ పరిశ్రమ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేలా కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ జరిమానాలకు నిరసనగా ఈ నెల 19న దేశ వ్యాప్తంగా లారీల సమ్మెకు ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సవరించిన భారత మోటారు వాహన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దూర ప్రాంతాలకు తిరిగే లారీలపై పెను భారం మోపింది. దీని ప్రకారం చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా పలు రాష్ట్రాల్లో రూ. 30వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానాలు విధిస్తున్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా అసలే సంక్షోభంలో ఉన్న లారీ పరిశ్రమకు ఈ కొత్త చట్టం పెను నష్టాన్ని తెచ్చి పడుతోందని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదితోపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ జరిమానాలు అమలు చేయటం లేదు కానీ, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు వెళ్లినప్పుడు జరిమానాల బాదుడు అధికంగా ఉంటోందని లారీ యజమానులు చెబుతున్నారు. అసలే బీమా ప్రీమియం, జీఎస్టీ వంటివి లారీ పరిశ్రమను కుదేలు చేస్తున్నాయని అంటున్నారు. లారీ పరిశ్రమను కాపాడుకోవాలంటే రానున్న ఆరు నెలల పాటు కొత్త లారీలు కొనుగోలు చేయరాదని ఆలిండియా మోటారు ట్రాన్స్ పోర్టు కాంగ్రెస్ లారీ యజమానులను కోరుతోంది. గురువారం జరిగే లారీల బంద్‌కు ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్ల అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించింది.