ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ చైర్మన్ పచముత్తు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 27: చెన్నై కేంద్రంగా పలు విద్యా సంస్థలు నడుపుతున్న ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ విద్యా సంస్థల అధినేత టిఆర్ పచముత్తును చెన్నై సిటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్‌ఆర్‌ఎం డీమ్డ్ యూనివర్శిటీ కింద మెడికల్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ ఇలా పలు విద్యా సంస్థలను ఆయన నడుపుతున్నారు. ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాజధాని అమరావతిలో మరో నాలుగు విద్యా సంస్థలతో పాటు ఎస్‌ఆర్‌ఎం విద్యా సంస్థకు 200 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. పచముత్తు అరెస్టుతో ఈ భూమి కేటాయింపుపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. వైద్య కళాశాలలో సీట్లు ఇప్పిస్తానంటూ పచముత్తు 111 మంది నుంచి రూ.75 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. మొత్తం 109 చీటింగ్ కేసులు ఆయనపై నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. రాజధానిలో రైతుల భూముల పందారంపై సిపిఎం రాష్ట్ర నేత సిహెచ్ బాబూరావు ధ్వజమెత్తారు. విద్యా వ్యాపారం చేసే కార్పొరేట్ సంస్థలకు కేవలం గజం వెయ్యి రూపాయలకే వందలాది ఎకరాలను కట్టబెట్టడం దారుణమంటూ దీనిపై ప్రభుత్వం తక్షణం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. గత మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఎస్‌ఆర్‌ఎం సంస్థతో పాటు ఇండియన్ యుకె హెల్త్ కేర్, విట్, ఎమిటి విద్యా సంస్థలకు కూడా భూములను కేటాయించడం జరిగింది.