ఆంధ్రప్రదేశ్‌

రివర్స్ టెండరింగ్ నష్టమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోట్లాది మంది ప్రజల కల అని, వైసీపీ ప్రభుత్వ విధ్వంసకర చర్యలతో ప్రాజెక్టు పనులు అస్తవ్యస్థంగా మారాయని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కేవలం ఏడుశాతం లోపు మాత్రమే పనులు పూరె్తైన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిన తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో 71 శాతం వరకు పనులను పూర్తి చేయగలిగామన్నారు. మరో ఏడాది కష్టపడితే పూర్తయ్యే దశకు ప్రాజెక్టు పనులను తీసుకు రాగలిగామని, అలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం అనాలోచిత చర్యలతో ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఛలో ఆత్మకూరు సందర్భంలో తన ఇంటికి నోటీసు అంటించినంత తేలికగా పోలవరం ప్రాజెక్ట్‌ను పరిగణించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవాచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రం చేయాల్సిన పనిలేదని, కేంద్రమే చేసుకుంటుందని ఢిల్లీ వెళ్లి మరీ చెప్పారని విమర్శించారు. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ అన్నారని, నిజానికి ఇది రివర్స్ టెండరింగ్ కాదని, రిజర్వ్‌డ్ టెండరింగ్ అని వ్యాఖ్యానించారు. అనుకూల వ్యక్తులకు టెండర్లను రిజర్వ్‌డ్ చేశారు కాబట్టే ఇది రిజిష్టర్డ్ టెండరింగ్ అని ఆరోపించారు. పీపీఎ, కేంద్ర జలవనరుల శాఖ, సిడబ్ల్యుసి, ఐఐటి ప్రొఫెసర్‌లు, సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ నిపుణులు వంటి అనేక ప్రముఖ సాంకేతిక కమిటీలన్నీ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగస్వాములయ్యాయని వివరించారు. అలాంటిది ఎవ్వరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా పనులు నిలిపివేసి రివర్స్ టెండరింగ్ నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. వాస్తవానికి రివర్స్ టెండరింగ్ అనేది భారీ ప్రాజెక్టుల ప్రగతికి మంచిది కాదని, ప్రాజెక్టు భద్రత ఎంతో ముఖ్యమన్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అధారిటీ 9 అంశాలతో కూడిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసిందని వివరించారు. 2009లో పోలవరం టెండర్లను రద్దుచేసిన చర్యతో 2013 వరకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికీ వాటికి సంబంధించిన ఎకౌంట్లు కూడా సెటిల్ కాలేదని చెప్పారు. రీ టెండరింగ్ వల్ల పొదుపు చేసే దాని కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగు లిఫ్ట్(పట్టిసీమ, పురుషోత్తపట్నం, తాడిపూడి, పుష్కర) లకు రూ.300 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని, డి మొబిలైజేషన్, ఆపర్చ్యునిటి కాస్ట్ చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. కొత్తగా వచ్చే వారు దీని కంటే తక్కువ చేస్తారనే నమ్మకం లేదంటూ పీపీఎ ఇచ్చిన 9 అంశాల్లో హెచ్చరించారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. గోదావరిలో మునిగిన బోటు ఎక్కడుందో చెప్పలేని వారు పోలవరం సాంకేతిక అంశాలపై ఏ విధంగా మాట్లాడగలరని చంద్రబాబు నిలదీశారు. అలాంటి పనుల్లో గతానుభవం ఉన్న వారికే ఆ పనులు ఇవ్వాలని సివిసి చెప్పిన అంశాన్ని గుర్తుచేశారు. కేంద్రం, పీపీఎ, సిడబ్ల్యుసి చెప్పినప్పటికీ వినే పరిస్థితిలో లేరని, తన బంధువైన ఆర్‌అండ్‌బి ఇంజనీర్ పీటర్ చెప్పినట్లే పోలవరాన్ని నడిపిస్తున్నారని తప్పుబట్టారు. టెక్నికల్ బిడ్ కన్నా ప్రైస్ బిడ్‌కే వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, తమ ఇంటికి నోటీసు అంటించినంత తేలికగా జీవనాడి అయిన పోలవరాన్ని తీసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. సాధారణంగా ముందు టెక్నికల్ బిడ్ చూశాకే ప్రైస్ బిడ్ తెరవాలని, అలాంటిది రివర్స్ చేస్తూ సిమిలర్ వర్క్స్ చేసిన అనుభవాన్ని గాలికొదిలేశారంటూ తప్పుబట్టారు. పోలవరం ఎంత ముఖ్యమైన ప్రాజెక్టో అంత క్లిష్టమైందని, ప్రపంచంలోనే ఇదొక యూనిక్ ప్రాజెక్టుగా నిలవనుందని, 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా డిజైన్ చేసిన ప్రాజెక్టని పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వ అనాలోచిత, అనుభవ రాహిత్య విధాన నిర్ణయాలతో అధోగతి పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.