ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో వ్యవసాయానికి అదనంగా విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: రాష్ట్రంలో రైతాంగానికి ఏడు గంటల కంటే ఎక్కువగా అదనంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించారని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక్క ఎకరం పొలం కూడా ఎండిపోనివ్వమని ఆయన చెప్పారు. ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖలు ఉమ్మడిగా కృషి చేసి రైతుల ప్రయోజనం కోసం కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రెయిన్‌గన్స్,బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పంటల రక్షణకు రెయిన్ గన్స్‌ను వినియోగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ అదనంగా విద్యుత్ కావాలో గుర్తించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. ఈ నివేదికలకు అనుగుణంగా ఖరీఫ్‌లో పంటలు ఎం డిపోకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్, విద్యుత్ సలహాదారు కె రంగనాథం, డిస్కాంల ఎండిలతో సమీక్షించామని ఆయన చెప్పారు.