ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో 200 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి పేర్ని నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలను కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి 150 నుంచి 200 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ రెండు టన్నుల సామర్థ్యం కలిగిన, రూ. 6 లక్షలు విలువైన ఎలక్ట్రికల్ వాహనాన్ని విరాళంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుమల కొండను కాలుష్య రహితంగా తీర్చిదిద్దడానికి ఎలక్ట్రికల్ బస్సుల వినియోగంపై దృష్టిసారిస్తున్నామన్నారు.