ఆంధ్రప్రదేశ్‌

అమరావతి రాజధానిపై అవాకులు చవాకులు పేలకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: అమరావతి రాజధానిలో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పాన్ని నీరుకార్చే ప్రయత్నం చేయవద్దని తెలుగుదేశం అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక వైకాపాకు హితవుచెప్పారు. అమరావతిని అడ్డుకునేందుకు అన్నిరకాలుగా వైకాపా దిగజారిందన్నారు. ఆదివారం ఆమె ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు అన్ని జిల్లాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిని ఎంపిక చేశారన్నారు. ఎన్నికలకు ముందు వైకాపా నేతలు నల్లమల అడవుల వద్ద భూములు కొనుగోలు చేశారని, తామే అధికారంలోకి వస్తామని విర్రవీగారన్నారు. కాని ఎన్నికల ఫలితాలు తారుమారుకావడంతో అమరావతి రాజధాని ఏర్పాటును ఏ విధంగానైనా అడ్డుకోవాలని దుష్టపన్నాగాలు పన్నుతున్నారన్నారు. కేంద్రం స్విస్‌చాలెంజ్‌ను ఆమోదించలేదని, కేల్కర్ కమిటీ వ్యతిరేకించిందంటూ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారన్నారు. వైకాపా నేతలు అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకోమని, అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె కోరారు.