ఆంధ్రప్రదేశ్‌

బలపడని అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 28: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రెండు రోజులు కావస్తున్నప్పటికీ ఇది బలపడే అవకాశం కనిపించడం లేదు. బలపడేందుకు దోహదపడే రుతుపవన ప్రవాహాలు జపాన్ వైపు తరలిపోతుండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండేది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాభావంతో రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మంచి వర్షాలు కురిసే పరిస్థితి కనపించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం కూడా స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు భూ ఉపరితలానికి ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ అల్పపీడం మరింత బలపడేలా నైరుతి రుతుపవనాలు సహకరించే పరిస్థితులు లేవు. పసిఫిక్ మహాసముద్రంలో జపాన్‌కు దగ్గరగా తుపాను ఏర్పడింది. దీంతో అల్పపీడనం బలపడేందుకు సహకరించాల్సిన నైరుతి రుతుపవనాలు జపాన్ దిశగా కదులుతున్నాయని విశ్రాంత వాతావరణ శాస్తవ్రేత రాళ్లబండి మురళీకృష్ణ తెలిపారు. రుతుపవనాలు చురుగ్గా ఉన్నా, బంగాళాఖాతం శాఖ, అరేబియన్ శాఖ నైరుతి రుతుపవనాలు తగినంత బలంగా లేవన్నారు. దీని ప్రభావంతో అల్పపీడనం బలపడే పరిస్థితులు లేవన్నారు. కాగా, ఆదివారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షపాతం నమోదైంది. పిడుగురాళ్లలో 9.4 సెంటీమీటర్లు, కారంచేడులో 8.2, ప్రకాశం బ్యారేజీలో 7.5, అవనిగడ్డలో 7.4, రాజమండ్రి, విజయవాడల్లో 7, మచిలీపట్నంలో 5.8, విశాఖ విమానాశ్రయంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.