ఆంధ్రప్రదేశ్‌

తెలుగు భాషాభివృద్ధికి నడుం బిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఆగస్టు 28: తెలుగు భాషను అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు పిలుపునిచ్చారు. ధూర్జటి రసజ్ఞ సమాఖ్య అధ్యక్షులు ఎన్ భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రసన్నవరదరాజ కల్యాణ మంటపంలో జాతీయ స్థాయి తెలుగు కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ ఆంగ్లభాష నేర్చుకోవడం తప్పు కాదనీ, తెలుగు భాషను విస్మరించడం తప్పు అన్నారు. మాతృభాష ప్రాచీన భాష అయిన తెలుగు భాషను ప్రతి ఒక్కరూ విధిగా అభ్యశించాలని పిలుపునిచ్చారు. కాగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 100 మంది కవులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
సిఎం చేస్తున్నది శూన్యం : యార్లగడ్డ
జాతీయ కవిసమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సాహితీ వేత్త పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నది శూన్యమేనని, అందుకే ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన తెలుగు భాష నేడు మరణ శయ్యపై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో సిఎం తెలుగుభాషాభివృద్ధికి అనేక హామీలు ఇస్తున్నారని, వాటి అమలులో మాత్రం నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నూతన రాజధాని అయిన అమరావతిలో మచ్చుకకు కూడా ఒక తెలుగు బోర్డు కనపడదన్నారు. ఇదేనా ముఖ్యమంత్రికి తెలుగు భాషపై ఉన్న ప్రేమ అభిమానాలని ఆయన ప్రశ్నించారు.