ఆంధ్రప్రదేశ్‌

వ్యవహారిక భాషకు పితామహుడు గిడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: తెలుగుతల్లి ముద్దుబిడ్డ గిడుగు రామమూర్తికి ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నివాళులర్పించారు. గిడుగు రామమూర్తి జయంతి రోజు ఆగస్టు 29న ఏటా తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటూ భాషపై మమకారాన్ని చాటుకుంటున్నామని తెలిపారు. వ్యవహారిక భాషా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ధన్యజీవి గుడుగు రామమూర్తి అని శ్లాఘించారు. తెలుగు భాష సొగస్సును ప్రపంచానికి చాటి చెప్పటానికి బాట వేసిన దార్శనికుడని ముఖ్యమంత్రి కొనియాడారు. గిడుగు వారి జయంతిని వ్యావహారిక భాష వేడుక చేసుకునే రోజుగా చెప్పవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లోని తెలుగు వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుభాష, కళల వికాసానికి తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని తెలిపారు. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని శ్రీ కృష్ణదేవరాయలు కీర్తిస్తే, ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ ఆధునిక కాలంలో శంకరంబాడి సుందరాచార్య పతాక గీతాన్ని రాసి విశ్వఖ్యాతి గడించారని కొనియాడారు. తర్వాత కాలంలో ఎన్టీ రామారావు తెలుగు తేజస్సును దశదిశలా చాటారని సిఎం తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించారని గుర్తు చేశారు. తెలుగుభాషా, సాంస్కృతిక వికాసానికి తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని సిఎం స్పష్టం చేశారు.