ఆంధ్రప్రదేశ్‌

నీతులు చెప్పొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 28: జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తిరుపతి బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు మిశ్రమ స్పందన వెలిబుచ్చారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలో టిడిపి ఎంపిలు ఘోరంగా విఫలమయ్యారని పవన్ చేసిన ఆరోపణపై ఎంపి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. హోదాపై తాము ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రధాన మంత్రిని సార్ అనకుండా ఏమని సంభోదించాలని ప్రశ్నించారు. ఈ విషయంలో మీకు కాస్తయినా స్పష్టత ఉంటే బహర్గత పరచాలని కోరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23సార్లు కేంద్రంతో చర్చించారని, ఈ విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయాలపై పవన్‌కు ఒక క్లారిటీ లేదని దుయ్యబట్టారు. ఇతరులకు నీతులు చెప్పేకంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సత్తా చూపాలని హితవు పలికారు.
ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదు..
రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదాకు ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని వైకాపా ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై బహిరంగంగా తెలుగుదేశంతో ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా వల్ల పన్ను రాయితీలు వంటివి వస్తాయని, పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుందన్నారు. పవన్ వ్యాఖ్యల వలన పెద్దగా ప్రభావం ఉండదన్నారు.
పరిశీలనలో హోదా : హరిబాబు
హోదా అంశం పరిశీలనలో ఉందని, ఇప్పటికే రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీ లన్నింటినీ బిజెపి పరిష్కరించిందని బిజెపి అధ్యక్షుడు హరిబాబు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ప్రకటనకు సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, వీటిని అధిగమించి ముందుకు సాగాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
విభేదించట్లేదు : సోము వీర్రాజు
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తాము విబేధించట్లేదని, అయితే ప్రత్యేక హోదా గురించి కేంద్రం పట్టించుకోవట్లేదన్న ఆరోపణ నిరాధారమని బిజెపి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఒకటొకటిగా విభజన హామీలన్నింటినీ కేంద్రం అమలు చేస్తోందన్నారు. పవన్ కోరితే ప్రధాని మోదీతో భేటీ ఏర్పాటు చేస్తామని, అందుకు పవన్ సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రజాభిప్రాయమే : మంత్రి గంటా
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రజల అభిప్రాయానే్న పవన్ ప్రస్తావించారన్నారు. హోదా సహా విభజన హామీల సాధనకు టిడిపి చేస్తున్న ప్రయత్నాలు తెలుసుకోవాలని సూచించారు. ఇదే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధికి చేస్తున్న కృషిని పవన్ ప్రస్తావించారని గుర్తు చేశారు.
చేతనైతే ఢిల్లీలో పోరాడు : టిజి
ఆదోని: ప్రత్యేక హోదా కోసం చేతనైతే ఢిల్లీలో పోరాడాలని, అంతేతప్ప పనికిరాని మాటలు వద్దని పవన్‌కళ్యాణ్‌కు రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ హితవు పలికారు. ఆదివారం ఆదోనిలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్వహించిన సభలో వెంకటేష్ ప్రసంగిస్తూ, ప్రత్యేక హోదా కోసం ఎంపిలు, ఎమ్మెల్యేలు పోరాడటం లేదనడం తగదన్నారు. పవన్ పోరాడితే తాము కూడా భాగస్వాములవుతామన్నారు.
ఎన్టీయే నుండి బయటకు రావాలి : రామకృష్ణ
విజయవాడ: ప్రత్యేక హోదాపై టిడిపికి చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి, ఎన్టీయే నుండి బయటకు రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. విభజన హామీల కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాడాలని, అప్పుడే ప్రజలు నమ్ముతారని చంద్రబాబుకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు.

చిత్రం.. ఎంపి అవంతి శ్రీనివాస్