ఆంధ్రప్రదేశ్‌

తెలుగు భాషను రక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 29: తెలుగు పరిరక్షణ, అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను అక్టోబర్ 2 గాంధీజయంతి నాటికి నెరవేర్చకపోతే చలో అమరావతి పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, భాషా ప్రియులతో కలిసి తామే తెలుగు భాష శిలాఫలకాలను ఏర్పాటు చేస్తామని ప్రముఖ సాహితీవేత్త, తెలుగు భాషా పరిరక్షకులు, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హెచ్చరించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద గిడుగు వెంకటరామమూర్తి పంతులు 153వ జయంతోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందీ అకాడమీ చైర్మన్, పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గిడిగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అంతేకాకుండా తెలుగు అభివృద్ధి పట్ల పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని నిరసిస్తూ యార్లగడ్డ స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు సోమవారం ఆవేదన దీక్షలు చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆవేదన దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రంలో మాతృభాష పరిరక్షణ, అభివృద్ధికి ఉద్యమించాల్సిన పరిస్థితులు తలెత్తడం నిజంగానే దురదృష్టకరమన్నారు. పాలకుల చిత్తశుద్ధికి కూడా కళంకమే అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో వారి మాతృభాష అభివృద్ధికి, పరిరక్షణకు పాలకులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. వారి చిత్తశుద్ధి తెలుగు పాలకుల్లో కనిపించకపోవడం వల్ల తెలుగువారి గుండె ఆక్రోశిస్తోందని, తెలుగు తల్లి గుండె బద్దలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో అద్భుతమైన సాంస్కృతిక రాజధానిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారన్నారు.