ఆంధ్రప్రదేశ్‌

తుంగభద్రలో పుట్టి మునక: ఒకరి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఆగస్టు 29: ఉరుకుంద ఈరన్నస్వామి పల్లకి ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవాన్ని తిలకిచేందుకు భక్తులు పుట్టిలో వస్తుండగా తుంగభద్ర నదిలో అది మునిగిపోయింది. దీంతో ఒకరు గల్లంతయ్యారు. మిగతావారు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటకలోని రాయచూరు జిల్లా మాన్వి తాలూకా వీమిలిపొన్నూరు గ్రామానికి చెందిన కొంతమంది యువకులు కర్నూలు జిల్లా ఉరుకుంద ఈరన్నస్వామి పల్లకి ఉత్సవంలో పాల్గొనేందుకు తుంగభద్ర నదిని పుట్టిలో దాటుతుండగా ప్రమాదవశాత్తు పుట్టి నీటిలో మునిగింది. దీంతో రాము నీళ్లలో కొట్టుకుపోయాడు. నీళ్లలో కొట్టుకుపోతున్న శేఖర్, నాగరాజు, ఈరన్నను గమనించిన పోలీసులు వారిని రక్షించారు. హుసేని, దేవా, హనుమంతు, బసవరాజు, యువరాజు ఈదుకుంటూ ఒడ్డుకుచేరుకున్నారు. రాము కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.