ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైల మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఆగస్టు 29: శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి సోమవారం శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో తగినంత వర్షాలు కురవాలని, పాడి పంటలతో పల్లెలు కళకళలాడాలని, పచ్చని పొలాలతో పుడమితల్లి సస్యశ్యామలాంగా ఉండాలనే సంకల్పంతో శ్రీ మల్లికార్జున స్వామి వారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించినట్లు దేవస్థానం ఇఓ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. లోకకళ్యాణం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా కలశ జలాలతో స్వామి వారిని అభిషేకించారు. ఇందులో భాగంగా వేకువజామున ఆలయ ద్వారాలు తెరిచి 4 గంటలకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల పూజ జరిపించారు. అక్కమహాదేవి అలంకరణ మండపంలో అర్చకులు, వేదపండితులు ఘటాభిషేక సంకల్పం పఠించారు. వేదపారాయణాలు, వరుణ ఆవాహనాలు తదితర జపాలు జరిపించారు. సంప్రదాయాన్ని అనుసరించి పాతాలేశ్వర స్వామి, నందీశ్వరుడు, అంకాలమ్మ, బయలువీరభద్ర స్వామికి విశేష పూజలు చేశారు. అనంతరం కృష్ణవేణి నదీ జలాలతో ఆలయ ప్రదక్షిణ చేసి సహస్ర ఘటాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

చిత్రం.. శ్రీశైల మల్లన్న అభిషేకానికి ఘటాల్లో కృష్ణాజలాలు తీసుకువస్తున్న దృశ్యం