ఆంధ్రప్రదేశ్‌

‘కరవుపై యుద్ధానికి విద్యార్థులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 30: రాష్ట్రంలో ఎక్కడ కరవు పరిస్థితులు నెలకొన్నా ఎదుర్కొని పోరాడేందుకు రైతులకు తోడుగా విద్యార్థులను రంగంలోకి దించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ వరకు చదివిన విద్యార్థులు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతను కరవుపై యుద్ధ సైనికులుగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరవుకాలంలో పంటలను కాపాడేందుకు వినియోగించే రెయిన్‌గన్లపై ఆయా కళాశాలల్లోని ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. అవసరమైతే వీరికి వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నాటికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక అధికారులు, మంత్రులను క్షేత్రస్థాయికి పంపింది. రెయిన్‌గన్ల ద్వారా ఎండుదశలో ఉన్న పంటలకు తడులు ఇస్తోంది. విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి శిబిరాలు నిర్వహించడం, రైతులకు పంట కుంటలపై అవగాహన కల్పించడం, గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు ఇంకుడుగుంతల తవ్వకంపై యువత కీలకపాత్ర పోషించేలా చేయడంపై త్వరలో అధికారిక నిర్ణయం తీసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. కరువు సైనికులుగా పాల్గొనే విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించేలా సర్ట్ఫికెట్లు ప్రదానం చేయాలని, ఉద్యోగ నియామక పరీక్షల్లో రెండు నుంచి ఐదు మార్కులు కలిపే విధంగా నిర్ణయం తీసుకుంటే విద్యార్థులు పెద్దసంఖ్యలో ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు.