ఆంధ్రప్రదేశ్‌

తూర్పున ‘దివీస్’ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 30: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని కోన తీర ప్రాంతంలో దివీస్ యాజమాన్యం మందుల ఫ్యాక్టరీ నిర్మాణానికి రంగం సిద్ధంచేస్తుండటాన్ని పరిసర ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఏ క్షణానైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో ఆయా గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. దివీస్ కంపెనీ యాజమాన్యం నిర్మాణ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తుండటంతో పెద్దఎత్తున స్థానికులు ప్రతిఘటిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు తీర ప్రాంతంలో మందులు, రసాయనిక పరిశ్రమల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం నేతలు, అధికారంలోకి రాగానే మాట మార్చారంటూ బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులందరూ మందుల ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే తమ ప్రాణాలకు ముప్పుతప్పదని తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తొండంగి మండలంలోని పంపాదిపేట, తాటాకులపాలెం, ఒంటిమామిడి, కొత్తపాకల గ్రామాల పరిధిలోని సుమారు 505 ఎకరాల్లో దివీస్ లేబొరేటరీస్ యాజమాన్యం మందుల ఫ్యాక్టరీ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. 2015లో ఎపిఐఐసి ఆధ్వర్యంలో 505 ఎకరాలను మందుల ఫ్యాక్టరీ కోసం సేకరించారు. ఈ భూములను దివీస్ కంపెనీకి బదలాయించారు. చాలా సంవత్సరాల క్రితం కోన తీర ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న పర్ర భూములను స్థానిక పేద రైతులు బాగుచేసుకుని, సేద్యానికి అనువుగా మలచుకున్నారు. తర్వాత సదరు రైతులకు ప్రభుత్వం నుండి డి పట్టాలు మంజూరయ్యాయి. తాజాగా ప్రభుత్వం బలవంతంగా రైతుల నుండి భూములను స్వాధీనం చేసుకుంది. రూ.600 కోట్లతో మందుల ఫ్యాక్టరీని నిర్మించడానికి కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం దివీస్ కంపెనీకి అనుకూలంగా, ఏకపక్షంగా వ్యవహరించి, అన్ని రకాల అనుమతులు దొడ్డిదారిలో వచ్చేందుకు సహకరించినట్టు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ బాధితులు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.

పంపాదిపేటలో మోహరించిన పోలీసు బలగాలు