ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక ఇబ్బందులు టీడీపీ పుణ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 11: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉండటానికి టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణమని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకం, డైట్ చార్జీలు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, స్థానిక సంస్థలు, ఆస్పత్రులలో ఔషధాల నుంచి చివరకు దూది లాంటి వాటికి కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవటంతో రూ. 42వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి 9 నుంచి 12 నెలల పాటు వేతనాలు చెల్లించ లేదన్నారు. వివిధ కార్పొరేషన్ల కింద తీసుకున్న అప్పులు కూడా దారి మళ్లించారని, టీడీపీ ప్రభుత్వం మొత్తంగా రూ. 65వేల కోట్ల బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా ఎన్నికల ముందు రూ. 5వేల కోట్లకు మించి బిల్లులు పెండింగ్‌లో ఉంచదన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన అవకతవకలన్నీ ఒక్కొక్కటిగా సరి చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ సంస్థలకు సబ్సిడీ, ఇతర బిల్లులు కూడా సక్రమంగా చెల్లించలేదని, గత ప్రభుత్వ హయాంలో రూ. 14వేల 857 కోట్లు బకాయిలు ఉంటే, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రూ. 20 వేల కోట్లు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారన్నారు. కేవలం 45 రోజుల వ్యవధిలో 25 ఏళ్ల కోసం 36 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవటం వల్ల తీరని నష్టం వాటిల్లిందన్నారు. ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, మద్యం విక్రయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు, ఇతర నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (రాష్ట్ర విద్యుత్ ఆర్థిక సంస్థ) రూ. 3వేల కోట్ల అప్పు కోసం ఎస్‌బీఐని ఆశ్రయిస్తే క్రిసల్, బ్రిక్‌వర్క్ సంస్థలు రేటింగ్ ఇవ్వకపోవటంతో తిరస్కరించినట్లు టీడీపీ చేస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. రేటింగ్‌లు గోప్యంగా ఉంటాయని, అలాంటప్పుడు బయటకు ఎలా వస్తాయని ప్రశ్నించారు. వాస్తవానికి ఎస్‌బీఐ ప్రభుత్వ ఔట్‌స్టాండింగ్ గ్యారెంటీని మాత్రమే ప్రస్తావించిందని తెలిపారు. 2017లో కేవలం రూ. 9665 కోట్లు ఉన్న గ్యారెంటీ మొత్తం 2018 నాటికి రూ. 35,964 కోట్లకు పెరగటాన్ని బ్యాంక్ ప్రశ్నించిందని, అప్పుడు అధికారంలో ఉంది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా ఆర్బీఐ నుంచి తీసుకునే రుణంలో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 7న రూ. 1000 కోట్లు కావాలని కోరామని, అది రూ. 2005 కోట్లుగా ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిందన్నారు. ఇది తమ ప్రభుత్వ విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాలుగు నెలల్లో ఏ రోజు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లలేదన్నారు. 2018-19లో టీడీపీ 43 రోజులు ఓడీకి వెళ్లిందని వివరించారు. విద్యుత్ రంగంపై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఖండించారు. 2018-19లో ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 6030 కోట్లు సబ్సిడీ చెల్లించాల్సి ఉండగా, బడ్జెట్‌లో రూ. 2050 కోట్లు మాత్రమే కేటాయించి అందులో సగం రూ. 1250 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. ప్రస్తుతం ఆ సబ్సిడీ రూ. 4780 కోట్లకు చేరిందని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ విద్యుత్ పంపిణీ సంస్థలకు మొత్తం రూ. 9256 కోట్ల సబ్సిడీ బకాయి పడిందన్నారు. ప్రభుత్వం వినియోగించిన విద్యుత్ బిల్లులు మరో 5601 కోట్లతో కలిపి 14857 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగంలో నష్టం రూ. 7200 కోట్ల నుంచి 14 వేల కోట్లకు చేరిందన్నారు. థర్మల్ విద్యుత్ చౌకధరలో అందుబాటులో ఉన్నా పవన విద్యుత్‌ను అధిక ధరలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. దీనివల్ల రూ. 2760 కోట్లు నష్టం ఏర్పడిందన్నారు. టీడీపీ హయాంలో అప్పులు తప్ప మరేదీ పెరగలేదని విమర్శించారు. ఎన్నికల ముందు సప్లిమెంట్ గ్రాంట్ తీసుకున్నారని, రూ. 38వేల కోట్లు వివిధ పథకాల కోసం ఖర్చు చేసి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రూ. 42వేల కోట్ల పెండింగ్ బిల్లులతో పాటు వివిధ కార్పొరేషన్ల రుణాలు రూ. 16 వేల కోట్లు, ఒకేరోజు చేసిన రూ. 5వేల కోట్ల అప్పు అన్నీ కలిపి రూ. 65వేల కోట్ల భారం తమ ప్రభుత్వంపై మోపారన్నారు. మరోవైపు బడా కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లించారని ఈ ఏడాది మార్చి నెలలోనే రూ. 3358 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించారన్నారు. అందులో కేవలం 8 మందికి రూ. 1067 కోట్లు అందాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక్కరోజునే రూ. 5వేల కోట్లు అప్పు చేశారన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ వస్తున్నామన్నారు. డిసెంబర్ నాటికి పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ. 1.23 లక్షల కోట్ల అప్పులు ఉంటే ఐదేళ్లలో అది రూ. 2.58 లక్షల కోట్లకు చేరిందన్నారు. సంపూర్ణ మద్య నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నూతన మద్యం విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోందని తెలిపారు. మద్యంపై చంద్రబాబు 2015లో 78 శాతం ఎక్సైజ్ సుంకం విధించారని, 2017లో అదనంగా పన్ను వసూలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచి ఈ ఏడాది జనవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు రూ. 4800 కోట్లు అప్పు తీసుకున్నారని తెలిపారు. 2014లో కేవలం రూ. 6వేల కోట్లు అప్పులు ఉంటే టీడీపీ అధికారం కోల్పోయే సమయానికి రూ. 20 వేల కోట్లకు చేరిందన్నారు. తలసరి ఆదాయం, పారిశ్రామిక పురోగతి కూడా గణనీయంగా తగ్గిందన్నారు. ఆర్థిక పరిస్థితిని గాటన పెట్టేందుకు అవసరమైన నియంత్రణ చర్యలు పాటిస్తున్నట్లు తెలిపారు.