ఆంధ్రప్రదేశ్‌

513.4 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురి సౌత్, సెప్టెంబర్ 1: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్‌కు గురువారం నీటి చేరిక పూర్తిగా నిలిచిపోవడంతో సాగర్ జలాశయం నీటిమట్టం 513.4 అడుగులకు చేరుకుంది. ఇది 137.5148 టిఎంసిలకు సమానం. హైదరాబాద్ వాసులకు తాగునీటి అవసరాల నిమిత్తం 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకు 2506 క్యూసెక్కులనీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 817.2 అడుగులకు చేరుకుంది. ఇది 151.449 టిఎంసిలకు సమానం. ఎగువ జలాశయాలైన తుంగభద్ర, రోజా ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి 16వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది.