ఆంధ్రప్రదేశ్‌

పులిచింతలకు కొనసాగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 1: పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో ఇన్‌ఫ్లోను నిలిపివేశారు. గురువారం నాటికి 17.2 టిఎంసిల నీరు చేరడంతో రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నల్గొండ, గుంటూరు జిల్లాల్లో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు లక్ష క్యూసెక్కులకు పైగా ఎగువ నుంచి వరద నీరు చేరింది. ఉద్ధృతి మరింత పెరిగితే పూర్తిస్థాయిలో ముంపు గ్రామాలకు ముప్పు తప్పదనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దీంతో అందుబాటులో ఉన్న వాహనాల్లో నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరిలో కొంతమంది పునరావాస కేంద్రాలకు తరలివచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇన్‌ఫ్లో తగ్గినప్పటికీ కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు వరదనీరు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పులిచింతల ఎస్‌ఇ వెంకటరమణ ఆంధ్రభూమికి తెలిపారు.