ఆంధ్రప్రదేశ్‌

రైతు భరోసా పేరిట రైతుల మధ్య విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 13: రైతు భరోసా పేరిట రైతుల మధ్య ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విభేదాలు సృష్టిస్తున్నారని గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు. ఆదివారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాక ముందు అన్నదాతల అడగులకు మడుగులొత్తుతానని డాంబికాలు పలికిన జగన్, అధికారంలోకి రాగానే రైతుల నోట్లో మట్టికొట్టారని విమర్శించారు. రైతు భరోసా పేరుతో ఏటా 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేంద్రం ఇస్తున్న 6 వేలు తన జేబులో వేసుకుని అన్నదాతలకు జగన్ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని విమర్శించారు. అన్నంపెట్టే అన్నదాతలకు కులం, మత రంగులు పులిమిన పార్టీ జగన్ సారధ్యంలోని వైసీపీయేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.